Ravichandran Ashwin : అంతర్జాతీయ క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్ టాప్-15 రికార్డులు ఇవే..
14 ఏళ్ల అశ్విన్ కెరీర్‌లో ప్రధాన మైలురాళ్లు ఇవే..

Top 15 Records by Ashwin in International Cricket
అంతర్జాతీయ క్రికెట్‌కు టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసిన తరువాత అశ్విన్ తన నిర్ణయాన్ని ప్రకటించాడు. 14 ఏళ్ల క్రికెట్ కెరీర్‌లో ఎన్నో మైలురాళ్లను అశ్విన్ అందుకున్నాడు.
అశ్విన్ కెరీర్‌లో ప్రధాన మైలురాళ్లు ఇవే..
765 – అంతర్జాతీయ క్రికెట్‌లో అశ్విన్ తీసిన వికెట్ల సంఖ్య. టీమ్ఇండియా బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే (965) తరువాతి స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా 11వ బౌలర్‌గా నిలిచాడు.
537 – టెస్టు క్రికెట్‌లో అశ్విన్ వికెట్ల సంఖ్య. భారత్ తరుపున సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే (619) అగ్రస్థానంలో ఉన్నాడు.
1 – ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌గా అశ్విన్ రికార్డులకు ఎక్కాడు. మార్చి 2022లో అతడు ఈ ఘనత అందుకున్నాడు.
195 – ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ చరిత్రలో (మూడు ఎడిషన్లలో) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఘనత.
37 – టెస్టు క్రికెట్‌లో 37 సార్లు ఐదు వికెట్లు ప్రదర్శన చేశాడు. అశ్విన్ కంటే ముత్తయ్య మురళీధరన్ (67) మాత్రమే ఎక్కువ సార్లు ఈ ఘనత సాధించారు.
2 – టెస్టుల్లో అత్యంత వేగంగా 500 వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. 98 మ్యాచుల్లోనే అతడు ఈ మైలురాయిని చేరుకున్నాడు. 250, 300, 350 టెస్టు వికెట్లు వేగంగా సాధించిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు.
11 – టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ (11సార్లు) సొంతం చేసుకున్న ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. మొత్తంగా (అన్ని ఫార్మాట్లలో కలిపి) 12 సొంతం చేసుకున్నాడు. భారత క్రికెటర్లలో విరాట్ కోహ్లీ (21), సచిన్ టెండూల్కర్ (20)లు మాత్రమే అతడి కన్నా ముందు ఉన్నారు.
226 – టెస్టు క్రికెట్‌లో బౌల్ట్, ఎల్బీడబ్ల్యూగా ఎక్కువ వికెట్లు తీసిన స్పిన్ బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు.
302 – అంతర్జాతీయ క్రికెట్‌లో 300 కంటే ఎక్కువ బౌల్డ్, ఎల్బీడబ్ల్యూఔట్‌లను నమోదు చేసిన ముగ్గురు బౌలర్‌లలో అశ్విన్ ఒకడు. మిగతా ఇద్దరు మురళీధరన్ (336), జేమ్స్ ఆండర్సన్ (320).
4 – టెస్టు క్రికెట్ లో నాలుగు సందర్భాల్లో అశ్విన్ ఒక టెస్టు మ్యాచులో ఐదు వికెట్లు తీయడంతో పాటు సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్ ఆటగాడు ఇయాన్ బోథమ్ (5) మాత్రమే అతడి కన్నా ముందు ఉన్నాడు.
156 – వన్డే క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత నాలుగో స్పిన్నర్‌గా నిలిచాడు.
383 – టెస్టు క్రికెట్‌లో స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అతడు 65 మ్యాచుల్లో 383 వికెట్లు తీశాడు.
475 – స్వదేశంలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే తర్వాత అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు. అతడి కంటే కుంబ్లే (476) మరో వికెట్ తీశాడు.
46.0 – భారత బౌలర్లలో స్వదేశంలో కనీసం 200 వికెట్లు తీసిన బౌలర్ల సగటు జాబితాలో అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు.