Rohit Sharma : క్రికెట్‌కు అశ్విన్ గుడ్ బై.. పుజారా, రహానెల రిటైర్‌మెంట్ పై రోహిత్ శర్మ కామెంట్స్..
ఇప్పుడు అందరి దృష్టి టెస్టు స్పెషలిస్టులు ఛతేశ్వర పుజారా, అజింక్యా రహానెలపై పడింది.

Rohit Sharma Hilarious Reply Says Rahane Pujara Arent Retired Yet
గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు మ్యాచ్ అనంతరం టీమ్ఇండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్ ప్రకటించాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి టెస్టు స్పెషలిస్టులు ఛతేశ్వర పుజారా, అజింక్యా రహానెలపై పడింది. ఈ ఇద్దరూ స్టార్ ఆటగాళ్లు భారత జట్టుకు ఆడి దాదాపు ఏడాదికి పైగా కావొస్తుంది. యువ ఆటగాళ్లు రిషబ్ పంత్, సర్ఫరాజ్ ఖాన్, శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు సుదీర్ఘ ఫార్మాట్లలలో సత్తా చాటుతుండడంతో సెలక్టర్లు వీరి వైపు చూడడం లేదు.
రవిచంద్రన్ అశ్విన్ రిటైర్‌మెంట్ పై విలేకరుల సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. రిటైర్ అయినా కానీ తాము కలుస్తామని చెప్పుకొచ్చాడు. అశ్విన్, రహానే, పుజారాలను మనం విభిన్న పాత్రల్లో చూడబోతున్నామా అని ఈ సందర్భంగా విలేకరులు ప్రశ్నించారు. ఈ క్రమంలో రోహిత్ మాట్లాడుతూ.. అశ్విన్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం అని, అతడు రేపు స్వదేశానికి వెలుతున్నట్లుగా చెప్పాడు.
రిటైర్ అయ్యాడు గనుక మిగిలిన రెండు టెస్టుల్లో అశ్విన్ ఆడడని అన్నాడు. అదే సమయంలో రహానె, పుజారా గురించి మాట్లాడుతూ కాస్త కన్ఫూజ్ అయ్యాడు. ఈ ముగ్గురూ రిటైర్ అయ్యారని చెప్పుకొచ్చాడు. వెంటనే తేరుకుని పుజారా, రహానెలు ఇంకా రిటైర్‌మెంట్ ప్రకటించలేదు అనే విషయాన్ని గుర్తు చేశాడు. దీంతో అక్కడ నవ్వులు విరిశాయి.
రహానె, పుజారాలు ఇంకా క్రికెట్ ఆడుతున్నారన్నాడు. వారిద్దరికి ఇంకా దారులు మూసుకుపోలేదన్నాడు. మంచి ప్రదర్శనలు చేస్తే జట్టులో చోటు దక్కుతుందన్నాడు. ఈ సిరీస్‌లో మరేమైన సర్‌ప్రైజ్‌లు (రిటైర్‌మెంట్ల) ఉన్నాయా అని ప్రశ్నించగా ప్రస్తుతానికి ఏమీ లేవని రోహిత్ శర్మ చెప్పాడు.
Question – Pujara, Rahane and Ashwin will be seen in different roles?
Rohit Sharma – arre bhai, khali Ashwin announce Kiya hain retirement. Tum log marwa doge mujhe, wo dono active hain aur kabhi bhi aa sakte hain perform karke. 🤣🔥 pic.twitter.com/DdYI0tZul5
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 18, 2024