IND vs AUS : గ‌బ్బాలో వ‌రుణుడి ఆట‌.. డ్రా ముగిసిన మూడో టెస్టు.. ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ గా ట్రావిస్ హెడ్‌

భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య గ‌బ్బా వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది.

IND vs AUS : గ‌బ్బాలో వ‌రుణుడి ఆట‌.. డ్రా ముగిసిన మూడో టెస్టు.. ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ గా ట్రావిస్ హెడ్‌

Border Gavaskar Trophy IND vs AUS 3rd Test Match drawn

Updated On : December 18, 2024 / 11:24 AM IST

భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య గ‌బ్బా వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ డ్రా గా ముగిసింది. 275 ప‌రుగుల లక్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 2.1 ఓవ‌ర్ల‌లో వికెట్లు కోల్పోకుండా 8 ప‌రుగులు చేసింది. ఈ ద‌శ‌లో వ‌ర్షం మొద‌లైంది. ఎడ‌తెగ‌ని వ‌ర్షం కార‌ణంగా ఐదో రోజు చివ‌రి రెండు సెష‌న్ల ఆటను అంపైర్లు ర‌ద్దు చేశారు. దీంతో మ్యాచ్ డ్రా గా ముగిసింది. దీంతో ప్ర‌స్తుతం సిరీస్ 1-1తో స‌మంగా ఉంది. బోర్డ‌ర్‌గ‌వాస్క‌ర్ ట్రోఫీలో నాలుగో టెస్టు మ్యాచ్ డిసెంబ‌ర్ 26న మెల్‌బోర్న్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది.

అంత‌క ముందు ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌ను 89/7 స్కోరు వ‌ద్ద డిక్లేర్ చేసింది. మొద‌టి ఇన్నింగ్స్‌లో 185 ప‌రుగుల ఆధిక్యం ల‌భించడంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాట‌ర్లు దూకుడుగా ఆడారు. అయితే భార‌త బౌల‌ర్లు ఆసీస్ బ్యాట‌ర్ల ఆటలు సాగ‌నివ్వ‌లేదు. వ‌రుస విరామాల్లో వికెట్లు తీస్తూ వ‌చ్చారు. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో పాట్ క‌మిన్స్ (22), అలెక్స్ కేరీ (20 నాటౌట్‌), ట్రావిస్ హెడ్ (17) లు రెండు అంకెల స్కోరు సాధించారు. భార‌త బౌల‌ర్ల‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా మూడు, మ‌హ్మ‌ద్ సిరాజ్, ఆకాశ్ దీప్ లు చెరో రెండు వికెట్లు తీశారు.

Prithvi Shaw : పృథ్వీ షాకు మ‌రో షాక్‌.. ఆవేద‌న‌తో ఇన్‌స్టా పోస్ట్‌.. దేవుడా నువ్వే చెప్పు..

ఓవ‌ర్ నైట్ స్కోరు 252/9తో ఐదో రోజు తొలి ఇన్నింగ్స్‌ను కొన‌సాగించిన భార‌త్ మ‌రో 8 ప‌రుగులు జోడించి చివ‌రి వికెట్ ను కోల్పోయింది. దీంతో ఆసీస్‌కు 185 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది.

మ్యాచ్ స్కోరు వివ‌రాలు..
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 445 ప‌రుగులు
భార‌త తొలి ఇన్నింగ్స్ : 260 ప‌రుగులు
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : 89/7 డిక్లేర్‌
భార‌త రెండో ఇన్నింగ్స్ : 8/0 (2.1 ఓవ‌ర్ల‌లో)

ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ : ట్రావిస్ హెడ్‌