Prithvi Shaw : పృథ్వీ షాకు మ‌రో షాక్‌.. ఆవేద‌న‌తో ఇన్‌స్టా పోస్ట్‌.. దేవుడా నువ్వే చెప్పు..

గ‌త కొన్నాళ్లుగా టీమ్ఇండియా ఆట‌గాడు పృథ్వీ షాకి ఏదీ క‌లిసి రావ‌డం లేదు.

Prithvi Shaw : పృథ్వీ షాకు మ‌రో షాక్‌.. ఆవేద‌న‌తో ఇన్‌స్టా పోస్ట్‌.. దేవుడా నువ్వే చెప్పు..

Prithvi Shaw reacts to Vijay Hazare snub Tell me god

Updated On : December 18, 2024 / 9:04 AM IST

గ‌త కొన్నాళ్లుగా టీమ్ఇండియా ఆట‌గాడు పృథ్వీ షాకి ఏదీ క‌లిసి రావ‌డం లేదు. జాతీయ జ‌ట్టుకు ఎన్న‌డో దూర‌మైన ఈ ఆట‌గాడు ఐపీఎల్ మెగా వేలంలోనూ అమ్ముడుపోలేదు. దేశ‌వాలీ మ్యాచుల్లో రాణించి టీమ్ఇండియాలో చోటు ద‌క్కించుకుంటాడ‌ని అత‌డి ఫ్యాన్స్ ఆరాట‌ప‌డుతుంటే అదీ జ‌ర‌గ‌డం లేదు. చివ‌రికి ముంబై జ‌ట్టులోనూ చోటు కోల్పోయాడు. ఈనెల 21 నుంచి ప్రారంభం కానున్న విజ‌య్ హ‌జారే ట్రోఫీలో మొద‌టి మూడు మ్యాచుల్లో పాల్గొనే ముంబై జ‌ట్టును ఎంపిక చేశారు. ఈ జ‌ట్టులో షాకి చోటు ద‌క్క‌లేదు.

ఇటీవ‌ల జ‌రిగిన స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై విజేతగా నిలిచింది. ఈ టోర్నీలో పాల్గొన్న పృథ్వీ షా పెద్ద‌గా రాణించ‌లేదు. 9 మ్యాచుల్లో 197 పరుగులు మాత్ర‌మే సాధించాడు. ఫైనల్‌లోనూ 10 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇదే టోర్నీలో ముంబైకి నాయ‌క‌త్వం వ‌హించిన అజింక్యా ర‌హానే 469 ప‌రుగుల‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. ర‌హానెను కూడా విజ‌య్ హ‌జారే ట్రోఫీకి ఎంపిక చేయ‌లేదు.

AUS vs IND: ట్రావిస్ హెడ్‌కు సారీ చెప్పిన ఆకాశ్ దీప్.. ఫన్నీ వీడియో వైరల్

రహానె విశ్రాంతి కావాల‌ని కోర‌డంతోనే అత‌డిని ఎంపిక చేయ‌లేద‌ని స‌మాచారం. 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌లో జ‌రిగే విజ‌య్ హ‌జారే ట్రోఫీకి సూర్య‌కుమార్ యాద‌వ్, శివ‌మ్ దూబె, శార్దూల్ ఠాకూర్‌లు ఎంపిక అయ్యారు. శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో ముంబై బ‌రిలోకి దిగ‌నుంది.

విజ‌య్ హ‌జారే ట్రోఫీకి ఎంపిక కాక‌పోవ‌డం ప‌ట్ల పృథ్వీ షా తీవ్ర నిరాశ‌కు గురి అయ్యాడు. ఈ క్ర‌మంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా తన ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. లిస్ట్ ఏ గ‌ణాకాంల‌ను పోస్ట్ చేశాడు. దేవుడా నేను ఇంకే చేయాలి. 65 ఇన్నింగ్స్‌ల్లో 126 స్ట్రైక్‌రేటుతో 55.7 స‌గ‌టుతో 3399 ప‌రుగులు చేశాను. ఇన్ని ప‌రుగులు చేసినా ఎంపిక కావ‌డానికి ఇవి స‌రిపోవు. అయిన‌ప్ప‌టికి నేను మీ (భ‌గ‌వంతుడి) పై విశ్వాసం ఉంచుతాను. ప్ర‌జ‌లు ఇప్ప‌టికి న‌న్ను న‌మ్ముతార‌ని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను త‌ప్ప‌కుండా తిరిగి వ‌స్తాను. ఓం సాయిరాం. అని పృథ్వీ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చాడు.

AUS vs IND : ‘ఫాలో ఆన్’ తప్పింది.. డ్రెస్సింగ్ రూంలో రోహిత్, కోహ్లీ, గంభీర్ సంబరాలు.. వీడియో వైరల్

కాగా.. పృథ్వీ షా పోస్టు పై కొంద‌రు నెటిజ‌న్లు మండిపడుతున్నారు. జ‌ట్టును ఎంపిక చేసేట‌ప్పుడు తాజా ఫామ్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటార‌నే విష‌యం తెలియ‌దా అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వ‌చ్చిన‌ అవ‌కాశాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచిస్తున్నారు.