AUS vs IND : ‘ఫాలో ఆన్’ తప్పింది.. డ్రెస్సింగ్ రూంలో రోహిత్, కోహ్లీ, గంభీర్ సంబరాలు.. వీడియో వైరల్

మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.

AUS vs IND : ‘ఫాలో ఆన్’ తప్పింది.. డ్రెస్సింగ్ రూంలో రోహిత్, కోహ్లీ, గంభీర్ సంబరాలు.. వీడియో వైరల్

Teamindia

Updated On : December 17, 2024 / 3:01 PM IST

IND vs AUS 3rd Test: బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో భారత్ జట్టు ‘ఫాలో ఆన్’ గండం నుంచి బయటపడింది. జస్ర్పీత్ బుమ్రా (10 నాటౌట్), ఆకాశ్ దీప్ (27 నాటౌట్) పదో వికెట్ కు 39 పరుగులు జోడించారు. ఈ క్రమంలో భారత్ జట్టును ఫాల్ ఆన్ గండం నుంచి గట్టెక్కించారు. దీంతో డ్రెస్సింగ్ రూంలో భారత్ ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు సంబురాలు చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also Read: IND vs AUS: బ్రిస్బేన్ టెస్టులో జడేజా సరికొత్త రికార్డు.. భారత్ నుంచి తొలి ప్లేయర్ అతనే

ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ క్రమంలో  కేఎల్ రాహుల్, (84), జడేజా (77) పరుగులతో భారత్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. అయితే, చివరిలో టెయిలెండర్లు జస్ర్పీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ మరో వికెట్ పడకుండా పరుగులు రాబట్టడంతో భారత్ ను ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేశారు.

Also Read: Rohit Sharma: ఆస్ట్రేలియాతో సిరీస్ తరువాత టెస్ట్ ఫార్మాట్‌కు రోహిత్ శర్మ గుడ్ బై.. నిజమెంత?

‘‘ఎంసీసీ చట్టం నిబంధ ప్రకారం ప్రకారం.. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేసింది. ఒకవేళ భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులు చేయకపోతే ‘ఫాలో ఆన్’ లో పడినట్లే. దీంతో ఒకవేళ ఆస్ట్రేలియా ఆహ్వానిస్తే మళ్లీ భారత్ బ్యాటింగ్ చేయాల్సి ఉండేది. అయితే, భారత్ ను రెండో ఇన్నింగ్స్ కోసం బ్యాటింగ్ కు ఆహ్వానించాలా.. వద్దా అనేది ఆస్ట్రేలియా ఇష్టం. ఈ ఇబ్బంది లేకుండా భారత్ 246 పరుగులను దాటేసి ఫాలో ఆన్ గండం నుంచి తప్పించుకుంది. ఇంకా ఒక్కరోజు ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఒకవేళ టీమిండియా ఆలౌట్ అయినా రెండో ఇన్నింగ్స్ లో మొదటి బ్యాటింగ్ ఆస్ట్రేలియానే చేయాల్సి ఉంటుంది. తద్వారా భారత్ కు మ్యాచ్ డ్రా చేసుకునే అవకాశాలు మెరుగయ్యాయి.