AUS vs IND: ట్రావిస్ హెడ్‌కు సారీ చెప్పిన ఆకాశ్ దీప్.. ఫన్నీ వీడియో వైరల్
మూడో టెస్టులో నాల్గోరోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఐదోరోజు ఆట ప్రారంభంకాగా..

Akash Deep Apologises To Travis Head
Akash Deep Apologises To Travis Head: బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా – భారత్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరుగుతుంది. ఐదోరోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే టీమిండియా తొలి ఇన్నింగ్స్ ను ముగించేసింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా జట్టు 445 పరుగులు చేయగా.. భారత్ జట్టు 260 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగస్ లో ఆసీస్ 185 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే, ఐదోరోజు ఆట ప్రారంభమైన కొద్దిసేపటికే ఆకాశ్ దీప్, ట్రావిస్ హెడ్ మధ్య ఫన్నీ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.
Also Read: AUS vs IND : మూడో టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్.. 185 పరుగుల ఆధిక్యంలో ఆసీస్
మూడో టెస్టులో నాల్గోరోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఐదోరోజు ఆట ప్రారంభంకాగా.. జస్ర్పీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ క్రీజులోకి వచ్చారు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ బౌలింగ్ చేస్తుండగా.. ఆకాశ్ దీప్ బ్యాటింగ్ చేస్తున్నాడు. నాథన్ లియాన్ వేసిన బంతిని ఆకాశ్ దీప్ ముందుకు అడుగేసి డిఫెన్స్ చేసే క్రమంలో ఆ బంతి ఆకాశ్ దీప్ ఫ్రంట్ ప్యాడ్ లో ఇరుక్కుపోయింది. అక్కడే హెల్మెంట్ పెట్టుకొని ఫీల్డింగ్ చేస్తున్న ట్రావిస్ హెడ్ ఆకాశ్ దీప్ వద్దకు వెళ్లి బంతిని ఇవ్వమని చేయి చాపాడు.
Also Read: AUS vs IND : ‘ఫాలో ఆన్’ తప్పింది.. డ్రెస్సింగ్ రూంలో రోహిత్, కోహ్లీ, గంభీర్ సంబరాలు.. వీడియో వైరల్
తన కుడికాలుకు కట్టుకున్న ఫ్యాడ్ లో ఇరుక్కుపోయిన బాల్ ను తీసిన ఆకాశ్ దీప్ ట్రావిస్ హెడ్ కు ఇవ్వకుండా కిందపడేశాడు. దీంతో ట్రావిస్ హెడ్ ఆకాశ్ వైపు ఆగ్రహంతో చూడగా.. ఆకాశ్ దీప్ సారీ.. సారీ అంటూ చేతితో సైగ చేశాడు. దీంతో హెడ్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెనక్కు వెళ్లాడు. ఈ ఫన్నీ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Akashdeep saying ‘sorry, sorry’. 😂pic.twitter.com/mUT0sW3872
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 18, 2024