AUS vs IND : మూడో టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్.. 185 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

మూడో టెస్టులో భాగంగా నాల్గోరోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. క్రీజులో జస్ర్పీత్ బుమ్రా, ఆకాశ్ దీప్ ఉన్నారు.

AUS vs IND : మూడో టెస్టు.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఆలౌట్.. 185 పరుగుల ఆధిక్యంలో ఆసీస్

Teamindia

Updated On : December 18, 2024 / 6:59 AM IST

IND vs AUs 3rd Test : బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా – భారత్ జట్ల మధ్య మూడో టెస్టు బ్రిస్బేన్ వేదికగా గబ్బాలో జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ 445 పరుగులు చేయగా.. భారత్ జట్టు 260 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఫలితంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.

Also Read: IND vs AUS: బ్రిస్బేన్ టెస్టులో జడేజా సరికొత్త రికార్డు.. భారత్ నుంచి తొలి ప్లేయర్ అతనే

మూడో టెస్టులో భాగంగా నాల్గోరోజు ఆట పూర్తయ్యే సరికి భారత్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. క్రీజులో జస్ర్పీత్ బుమ్రా (10), ఆకాశ్ దీప్ (27) ఉన్నారు. ఐదో రోజు (బుధవారం) ఉదయం 252 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో బుమ్రా, ఆకాశ్ దీప్ బ్యాటింగ్ ప్రారంభించారు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే ఆకాశ్ దీప్ 31(44 బంతుల్లో) పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. హెడ్ బౌలింగ్ లో స్టంప్ ఔట్ అయ్యాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ కు 260 పరుగుల వద్ద తెరపడింది.

 

అనంతరం రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా బ్యాటింగ్ ప్రారంభించాల్సి ఉండగా.. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోయింది. బ్రిస్బేన్ లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మ్యాచ్ పున: ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో మూడో టెస్టు డ్రా కావటం ఖాయంగా కనిపిస్తోంది.