IND vs AUS : మిగిలిన టెస్టుల‌కు ఆస్ట్రేలియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. జూనియ‌ర్ పాంటింగ్‌కు చోటు.. భార‌త్‌కు క‌ష్ట‌కాల‌మేనా?

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది.

IND vs AUS : మిగిలిన టెస్టుల‌కు ఆస్ట్రేలియా జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌.. జూనియ‌ర్ పాంటింగ్‌కు చోటు.. భార‌త్‌కు క‌ష్ట‌కాల‌మేనా?

McSweeney dropped for last two BGT Tests Konstas called up

Updated On : December 20, 2024 / 10:52 AM IST

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. తొలి మ్యాచులో భార‌త్ గెల‌వ‌గా రెండో మ్యాచులో ఆస్ట్రేలియా విజ‌యం సాధించింది. ఇక మూడో టెస్టు మ్యాచ్ డ్రా ముగిసింది. ప్ర‌స్తుతం సిరీస్ 1-1తో స‌మంగా ఉంది. నాలుగో టెస్టు మ్యాచ్ డిసెంబ‌ర్ 26 నుంచి మెల్‌బోర్న్ వేదిక‌గా ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మిగిలిన రెండు టెస్టు మ్యాచుల‌కు జ‌ట్టును ప్ర‌క‌టించింది.

ఓపెన‌ర్ నాథ‌న్ మెక్‌స్వీనీ పై వేటు ప‌డింది. 15 మంది జాబితాలో జూనియర్ పాంటింగ్ గా పేరుగాంచిన సామ్‌ కొన్‌స్టాస్ కు చోటు ద‌క్కింది. అత‌డు జాతీయ జ‌ట్టులో చోటుద‌క్కించుకోవ‌డం ఇదే తొలిసారి. పేస‌ర్‌ జే రిచర్డ్‌సన్‌ల‌కు కూడా ఛాన్స్ ఇచ్చింది. 2021-22 యాషెస్‌ సిరీస్ త‌రువాత గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూరం అయిన రిచ‌ర్డ్‌స‌న్ ఈ సిరీస్‌తోనే రీ ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ బ్యూ వెబ్‌స్టర్ సైతం జ‌ట్టులో కొన‌సాగించింది. గాయంతో ఇబ్బంది ప‌డుతున్న జోష్ హేజిల్‌వుడ్‌ను ఎంపిక చేయ‌లేదు.

SA vs PAK : పాక్ ఆట‌గాళ్లు అంటే అంతే మ‌రీ.. హెన్రిచ్ క్లాసెన్‌తో హరీస్ రవూఫ్ గొడ‌వ.. మ‌ధ్య‌లో దూరి పెద్దది చేసిన మహ్మద్ రిజ్వాన్..

19 సామ్‌ కొన్‌స్టాస్ దేశ‌వాలీలో అద‌ర‌గొడుతున్నాడు. సౌత్‌ ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో వరుస సెంచరీలు(152, 105) చేశాడు. భారత్‌-‘ఎ’తో అనధికారిక టెస్టు సిరీస్‌లో ఆస్ట్రేలియా-‘ఎ’ తరఫున 73 ప‌రుగుల‌తో రాణించాడు.

భారత్‌తో మూడు, నాలుగు టెస్టులకు ఆస్ట్రేలియా జట్టు ఇదే..

పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రవిస్ హెడ్(వైస్ కెప్టెన్), స్టీవ్ స్మిత్(వైస్ కెప్టెన్), సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొన్‌స్టాస్‌, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మిచెల్ మార్ష్, జే రిచర్డ్‌సన్‌, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్‌స్టర్‌.

IND-W vs WI-W : చ‌రిత్ర సృష్టించిన భార‌త మ‌హిళా క్రికెట‌ర్ రిచా ఘోష్‌.. దంచికొడితే.. ప్ర‌పంచ రికార్డు స‌మం..