IND vs AUS : రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ అప్‌డేట్..
ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు.

Akash Deep gives major update on Rohit Sharma availability for Boxing Day Test
మెల్‌బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి జరగనున్న బాక్సింగ్ డే టెస్టు కోసం భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే.. ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్ దయా వేసిన బంతి రోహిత్ ఎడమ మోకాలిని తగిలింది. దీంతో నొప్పితో శర్మ విలవిలలాడాడు. వెంటనే అతడికి వైద్య సాయం అందించారు. అయితే.. హిట్‌మ్యాన్ అయిన గాయం తీవ్రమైనది అని, అతడు బాక్సింగ్ డే టెస్టు ఆడడం అనుమానమేనని వార్తలు వచ్చాయి. దీనిపై టీమ్ఇండియా పేసర్ ఆకాశ్ దీప్ స్పందించాడు.
ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత భారత పేసర్ ఆకాష్ దీప్ మీడియాతో మాట్లాడాడు. ఈసందర్భంగా అతడికి రోహిత్ గాయం పై ప్రశ్న ఎదురైంది. క్రికెట్ ఆడేటప్పుడు దెబ్బలు తగలడం సహజం అని రోహిత్ శర్మ గాయాన్ని అతడు ధ్రువీకరించాడు.
Champions Trophy 2025 : ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఇదేనా? భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే.?
అయితే.. అదేమీ పెద్ద గాయం కాదని తాను అనుకుంటున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం రోహిత్ బాగానే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. ఆందోళన చెందాల్సిన పని లేదని, అతడు మెల్‌బోర్న్ టెస్టులో బరిలోకి దిగుతాడని అన్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి రెండు టెస్టుల్లో తుది జట్టులో ఆకాశ్ దీప్ కు స్థానం దక్కలేదు. మూడో టెస్టులో తుది జట్టులోకి వచ్చాడు. బౌలింగ్‌లో ఓ మోస్తరుగా రాణించాడు. మూడు వికెట్లు మాత్రమే తీశాడు. అయితే బ్యాటింగ్‌లో గొప్ప పోరాటాన్ని కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో పదకొండో స్థానంలోకి దిగి 31 పరుగులు చేశాడు. బుమ్రాతో కలిసి జట్టును ఫాలో ఆన్ గండం నుంచి బయటపడేశాడు.
Arjun Tendulkar: అర్జున్ టెండూల్కర్ సూపర్ బౌలింగ్.. ముంబై తుది జట్టులో చోటుదక్కేనా?