IND vs ENG : భారత్‌తో వన్డే, టీ20 సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ప్రకటన.. అతడొచ్చేశాడు..
స్వదేశంలో భారత్ ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది.

England name squads for India ODI and T20I series
టీమ్ఇండియా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ముగిసిన తరువాత స్వదేశంలో భారత్ ఇంగ్లాండ్‌తో వన్డే, టీ20 సిరీస్ ఆడనుంది. తొలుత టీ20, ఆ పై వన్డే సిరీస్ జరగనున్నాయి. ఇంగ్లాండ్‌తో సిరీస్ ముగిసిన వెంటనే పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది.
తాజాగా భారత్‌తో సిరీస్ కోసం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తమ జట్లను ప్రకటించింది. కెప్టెన్‌గా జోస్ బట్లర్ ఎంపిక అవ్వగా వన్డేలకు రూట్ తిరిగి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా నవంబర్‌లో కోల్‌కతా వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తరువాత అతడు మళ్లీ వన్డేలు ఆడలేదు. ఇటీవల కివీస్‌తో జరిగిన మూడో టెస్టులో ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ గాయం కావడంతో అతడిని ఎంపిక చేయలేదు.
PV Sindhu : ఘనంగా పీవీ సింధు వివాహం.. రాజస్థాన్‌లో ..
స్టార్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్ లు తమ స్థానాలు నిలుపుకున్నారు. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టీ20లు, 3 వన్డేలు జరగనున్నాయి. టీ20 సిరీస్ జనవరి 22నుంచి ఆరంభం కానుండగా.. ఫిబ్రవరి 6 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది.
భారత పర్యటనకు ఇంగ్లాండ్ టీ20 జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రేడెన్ కోర్స్, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
IND vs AUS : రోహిత్ శర్మ గాయంపై ఆకాశ్ దీప్ అప్‌డేట్..
భారత పర్యటనకు ఇంగ్లాండ్ వన్డే జట్టు..
జోస్ బట్లర్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గుస్ అట్కిన్సన్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడెన్ కార్సే, బెన్ డకెట్, జామీ ఓవర్టన్, జామీ స్మిత్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, జో రూట్, సాకిబ్ మహమూద్, ఫిల్ సాల్ట్, మార్క్ వుడ్.
షెడ్యూల్ ఇదే..
టీ20 సిరీస్ షెడ్యూల్..
తొలి టీ20 – జనవరి 22 – కోల్‌కతా వేదికగా..
రెండో టీ20 – జనవరి 25న – చెన్నై
మూడో టీ20- జనవరి 28 – రాజ్‌కోట్
నాలుగో టీ20 – జనవరి 31 – పూణె
ఐదో టీ20- ఫిబ్రవరి 2 – ముంబై
వన్డే సిరీస్ షెడ్యూల్..
తొలి వన్డే – ఫిబ్రవరి 6 న – నాగ్‌పూర్
రెండో వన్డే – ఫిబ్రవరి 9న – కటక్
మూడో వన్డే – ఫిబ్రవరి 12న – అహ్మదాబాద్