Mohammed Shami-Hasin Jahan : ష‌మీపై హ‌సీన్ జ‌హాన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు..

టీమ్ఇండియా ఆట‌గాడు మ‌హ్మ‌ద్ ష‌మీపై అత‌డి మాజీ భార్య హ‌సీన్ జ‌హాన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.

Hasin Jahan sensational allegations on Mohammed Shami

టీమ్ఇండియా ఆట‌గాడు మ‌హ్మ‌ద్ ష‌మీపై అత‌డి మాజీ భార్య హ‌సీన్ జ‌హాన్ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. త‌న‌ను ఎంత‌గానో వేధించాడ‌ని, అత‌డిది క్రూర‌మైన మ‌న‌స్త‌త్వం అని తెలిపింది. కోల్‌కతా హైకోర్టు భరణంపై ఇటీవల కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో సోష‌ల్ మీడియా వేదిక‌గా హ‌సీన్ సుదీర్ఘ పోస్ట్ ను చేసింది.

‘మమ్మల్ని చంప‌డానికి, మా పరువు తీయడానికి ఎంతమంది క్రిమినల్స్‌కు డబ్బులిచ్చావో? వేశ్యలకు, నేరస్థులకు ఇచ్చిన డబ్బును మన కూతురు భవిష్యత్తు కోసం ఖర్చు చేసి ఉంటే ఇప్పుడు మన జీవితం ఎంతో బాగుండేది. భగవంతుడు నాకు ఎంతో ధైర్యాన్ని, సహనాన్ని ఇచ్చాడు. నిజం కోసం ఏళ్ల త‌ర‌బ‌డి పోరాడుతూనే ఉన్నాను, ఉంటాను. పురుషాధిక్య స‌మాజంలో నింద‌లేసి నువ్వు మ‌ద్ధ‌తు పొంగ‌ల‌వేమో కానీ, ఏదో ఒక రోజు నీకు కూడా క‌ష్ట‌కాలం మొద‌లవుతుంది. ఇప్పుడు నీకు అండ‌గా నిలిచిన వాళ్లే అప్పుడు నిన్ను త‌రిమేస్తారు. చ‌ట్టంపై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది.’  అని ఇన్‌స్టాగ్రామ్‌లో హ‌సీన్ జ‌హాన్ రాసుకొచ్చింది.

ENG vs IND : ఎడ్జ్‌బాస్టన్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక విజయవంతమైన ల‌క్ష్య ఛేద‌న ఎంతంటే..?

2014లో ష‌మీ, హ‌సీన్‌కు పెళ్లైంది. వీరికి ఓ కూతురు ఉంది. ష‌మీకి, హ‌సీన్ మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో విడివిడిగా ఉంటున్నారు. 2018లో హ‌సీన్.. ష‌మీపై గృహ‌హింస కేసు పెట్టింది. దీన్నిపై విచార‌ణ జ‌రుగుతోంది. ఇటీవ‌ల హ‌సీన్‌, ఆమె కూతురు కోసం ష‌మీ రూ.4ల‌క్ష‌లు భ‌రణంగా చెల్లించాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. అయితే.. త‌న జీవ‌న శైలికి ఇది స‌రిపోద‌ని, నెల‌కు రూ.10ల‌క్ష‌లు కావాల‌ని కోరిన‌ట్లు హ‌సీన్‌ తెలిపింది.