ENG vs IND : ఎడ్జ్‌బాస్టన్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక విజయవంతమైన ల‌క్ష్య ఛేద‌న ఎంతంటే..?

ఎడ్జ్‌బాస్ట‌న్‌లో నాలుగో ఇన్నింగ్స్ ఆడిన జ‌ట్టు ఛేదించిన అత్య‌ధిక ల‌క్ష్య ఛేద‌న ఎంత అనే దానిపై అంద‌రి దృష్టి ఉంది.

ENG vs IND : ఎడ్జ్‌బాస్టన్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక విజయవంతమైన ల‌క్ష్య ఛేద‌న ఎంతంటే..?

Do you know Highest successful run-chase in Tests at Edgbaston

Updated On : July 5, 2025 / 2:46 PM IST

ఎడ్జ్‌బాస్ట‌న్ వేదిక‌గా భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. ప్ర‌స్తుతం భార‌త్ బ‌ల‌మైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను 407 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసి 180 ప‌రుగుల ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ను మొద‌లు పెట్టిన భార‌త్ మూడో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి వికెట్ న‌ష్టపోయి 64 ప‌రుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (28), క‌రుణ్ నాయ‌ర్ (7)లు ఉన్నారు. ప్ర‌స్తుతం భార‌త్ 244 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

మ్యాచ్‌లో మ‌రో రెండు రోజుల ఆట మాత్ర‌మే మిగిలి ఉన్న నేప‌థ్యంలో భార‌త్ ఎంత ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్‌కు నిర్దేశిస్తుంది అన్న‌ది ఆస‌క్తిరంగా మారింది. బ‌జ్‌బాల్ విధానంలో ఆడే ఇంగ్లాండ్ ఎంత‌టి ల‌క్ష్యాన్ని అయినా స‌రే ఛేదిస్తామ‌ని ఇప్ప‌టికే వెల్ల‌డించింది. దీంతో స‌గ‌టు క్రికెట్ అభిమాని దృష్టి అంతా ఇప్పుడు ఎడ్జ్‌బాస్ట‌న్‌లో నాలుగో ఇన్నింగ్స్ ఆడిన జ‌ట్టు ఛేదించిన అత్య‌ధిక ల‌క్ష్య ఛేద‌న ఎంత అనే దానిపై ఉంది.

Sanju Samson : కేరళ క్రికెట్ లీగ్ వేలంలో సంజూ శాంస‌న్ జాక్ పాట్‌.. వేలంలో అత్యంత ఖ‌రీదైన ఆట‌గాడిగా..

ఎడ్జ్‌బాస్ట‌న్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక ల‌క్ష్యాన్ని ఛేదించిన రికార్డు ఇంగ్లాండ్ పేరిటే ఉంది. 2022లో టీమ్ఇండియా పై 378 ప‌రుగుల ల‌క్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఇక రెండో స్థానంలో ద‌క్షిణాఫ్రికా ఉంది. 2008లో ద‌క్షిణాప్రికా జ‌ట్టు ఇంగ్లాండ్ పై 283 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది.

ఎడ్జ్‌బాస్ట‌న్‌లో నాలుగో ఇన్నింగ్స్‌లో అత్య‌ధిక ల‌క్ష్యాల‌ను ఛేదించిన జ‌ట్లు ఇవే..

* 2022లో భార‌త్ పై ఇంగ్లాండ్ 378/3
* 2008లో ఇంగ్లాండ్ పై ద‌క్షిణాఫ్రికా 283/5
* 2023లో ఇంగ్లాండ్ పై ఆస్ట్రేలియా 282/8
* 1999లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ 211/3
* 1991లో ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ 157/3.