Gautam Gambhir – Sanju Samson : మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు లంక పర్యటనకు వెళ్లింది. రాహుల్ ద్రవిడ్ నుంచి హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన గౌతమ్ గంభీర్ పర్యవేక్షణలో టీమ్ఇండియా తొలి ప్రాక్టీస్ సెషన్ జరిగింది. టీ20 ప్రపంచకప్ అనంతరం కొందరు ఆటగాళ్లు జింబాబ్వే పర్యటనకు విశ్రాంతి తీసుకోగా.. తాజాగా వీరంతా జట్టుతో చేరారు. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్, నయా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ల నేతృత్వంలో టీమ్ఇండియా తొలి సమరానికి సిద్ధం అవుతోంది.
తొలి టీ20 మ్యాచ్ జూలై 27న ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో సోమవారం శ్రీలంకకు వెళ్లిన భారత జట్టు మంగళవారం పల్లెకలెలో తమ తొలి ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించింది. ఈ సెషన్‌లో గౌతీ ప్రతి ఒక్క ఆటగాడితో ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. వారి లోపాలను సరి చేసే ప్రయత్నం చేశాడు. టీ20 ఫార్మాట్ అంటేనే దూకుడుగా ఆడాలని, ఎవరూ కూడా డిఫెన్స్ ఆడొద్దు అని ప్లేయర్లకు గంభీర్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Rohit Sharma : మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ఎసరు పెట్టిన రోహిత్ శర్మ..! శ్రీలంక సిరీస్‌లోనే..!
సంజూకు స్పెషల్ క్లాస్..
కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టినట్లుగా బీసీసీఐ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో ద్వారా గంభీర్ ప్రత్యేకంగా సంజూ శాంసన్‌తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. బ్యాటింగ్‌కు సంబంధించి కొన్ని చిట్కాలను సంజూకు గంభీర్ చెప్పారు.
వాస్తవానికి సంజూ శాంసన్‌లో టాలెంట్‌లో ఎలాంటి కొదవ లేదు. అయితే.. నిలకడ లేకపోవడమే అతడి బలహీనత. చాలా సార్లు అతడు చెత్త షాట్లు ఆడి పెవిలియన్‌కు చేరుకుంటూ ఉంటాడు. భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ తరుచుగా సంజూ గురించి ఇదే చెబుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే సంజూ బ్యాటింగ్ పై గంభీర్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లుగా అర్థమవుతోంది. ఎక్కువ సేపు క్రీజులో ఉండాలని అతడికి సూచించినట్లు తెలుస్తోంది.
కాగా.. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఉండడంతో సంజూ శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా అన్నది సందేహమే. అయితే.. మిడిల్ ఆర్డర్‌లో ఆడించే అవకాశాలను కొట్టి పారేయలేము. చూడాలి మరీ సంజూ శాంసన్‌ను గంభీర్ అయినా సరిగ్గా ఉపయోగించుకుంటాడో లేదో మరి.
???? ????? ?????? ??????? ????? ??????! ?#TeamIndia | #SLvIND | @GautamGambhir pic.twitter.com/sbG7VLfXGc
— BCCI (@BCCI) July 23, 2024