Amy Jones : ప్రేయసితో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ నిశ్చితార్థం.. గడిచిన ఏడాదిలో నాలుగో మహిళా క్రికెట్ జంట..!
ఇంగ్లాండ్ మహిళా వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్, ఆస్ట్రేలియా మహిళా పేసర్ పైపా క్లియరీలు నిశ్చితార్థం చేసుకున్నారు.

English Cricketer Amy Jones And Aussie Piepa Cleary Announce Engagement In Heartwarming Post
Amy Jones – Piepa Cleary : ప్రస్తుతం సమాజం ఎటువైపు పోతుందో అర్థం కావడం లేదు. ఒకప్పుడు పెళ్లంటే ఓ ఆడ, ఓ మగ ఇద్దరూ కలిసి చేసుకునేవారు. గత కొన్నాళ్లుగా దీనిలో మార్పు వచ్చింది. ఇటీవల సేమ్ జెండర్ మ్యారేజ్‌లు పెరిగిపోతున్నాయి. ఇద్దరు ఆడ లేదా ఇద్దరు మగ కలిసి జీవించాలని అనుకుంటున్నారు. ఇక జెంటిల్ మేన్ గేమ్‌గా చెప్పుకునే క్రికెట్‌లో ఈ దోరణి పెరిగిపోతుంది. గడిచిన ఏడాది కాలంలో ముగ్గురు నలుగురు మహిళా క్రికెటర్లు తమ ప్రియురాళ్లను వివాహం చేసుకున్నారు.
తాజాగా ఇంగ్లాండ్ మహిళా వికెట్ కీపర్ బ్యాటర్ అమీ జోన్స్, ఆస్ట్రేలియా మహిళా పేసర్ పైపా క్లియరీలు నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వీరిద్దరు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. క్లియెరీ, అమీ లు ఇద్దరూ కూడా తమ తమ జాతీయ జట్ల మధ్య ఉన్న వైరాన్ని పక్కన పెట్టి రింగులు మార్చుకోవడం గమనార్హం.
ఉమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ తరుపున ఆడుతున్న సమయంలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ తరువాత అది స్నేహంగా మారింది. అనంతరం అది ప్రేమగా మారింది. గత కొన్నాళ్లుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు.
1993 జూన్ 13న వెస్ట్‌మిడ్‌లాండ్స్‌లో జన్మించింది అమీజోన్స్. 2019లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేసింది. ఇప్పటి వరకు ఆమె తన కెరీర్‌లో 6 టెస్టులు, 91 వన్డేలు, 107 టీ20 మ్యాచులు ఆడింది. మొత్తంగా 3వేల పైచిలుకు పరుగులు సాధించింది. అమీ కంటే మూడేళ్లు చిన్నది పియెపా క్లియెరీ. 1996 జూలై 17న జన్మించింది. దేశవాలీ క్రికెట్‌తో పాటు బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతూ మంచి పేసర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన కెరీర్‌లో 114 వికెట్లు పడగొట్టింది. కాగా.. క్లియెరీ ఇంకా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టలేదు.
View this post on Instagram