Ishan Kishan Pic: ©ANI
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మరోసారి రెచ్చిపోయింది. ఐపీఎల్ చరిత్రలోనే సెకండ్ హయ్యెస్ట్ స్కోర్‌ను నమోదు చేసింది. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదైన మొదటి మూడు స్థానాల్లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టే ఉంది.
ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచులో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 286/6 స్కోరు చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోరు.
ఇక ఐపీఎల్ 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 287/3తో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ అత్యధిక స్కోరు నమోదు చేసిన విషయం తెలిసిందే. అదే సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీ.. ముంబై ఇండియన్స్‌పై 277/3 స్కోరు చేసింది.
అత్యధిక స్కోర్లు ఇవే