T20 World Cup 2021 : టీమిండియా ఓటమికి ఆ అంపైరే కారణమా!

టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రెండు పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో పడింది.

T20 World Cup 2021 : : టీ20 ప్రపంచకప్ 2021 టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన భారత్ ఆదిలోనే రెండు పరాజయాలతో పీకల్లోతు కష్టాల్లో పడింది. మొదటి మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్ తో తలపడిన భారత్ 10 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఇక ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ప్రస్తుతం భారత జట్టు గ్రూప్ బిలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.

చదవండి : T20 World Cup 2021: పాక్ మ్యాచ్‌లో వైఫల్యం.. రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్

ఇక ఇదిలా ఉంటే న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోవడానికి అంపైర్ రిచర్డ్‌ కెటిల్‌బరోనే కారణమంటున్నారు క్రికెట్ అభిమానులు. కివీస్‌తో మ్యాచ్‌కు ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరించిన రిచర్డ్‌.. కోహ్లి సేనను దగ్గరుండి ఓడించాడని నెటిజన్లు మండిపడుతున్నారు. కెటిల్‌బరో అంపైర్‌గా ఉండటం వల్లే టీమిండియా ఓడిందని ట్రోల్‌ చేస్తున్నారు. కొందరేమో రిచర్డ్‌ భారత జట్టు పాలిట శనిలా దాపురించాడని, అతను అంపైరింగ్‌ చేసిన నాకౌట్ మ్యాచ్​ల్లో భారత్ ఒక్కటి కూడా గెలవలేదని గుర్తు చేస్తున్నారు.

చదవండి : T20 World Cup 2021: కివీస్ టార్గెట్ 111.. టాప్ స్కోరర్ రవీంద్ర జడేజా 26

2014 నుంచి ఈ ఏడాది న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ ఛాంపియన్షిప్‌ ఫైనల్‌ వరకు రిచర్డ్ కెటిల్‌బరో అంపైరింగ్ చేసిన ప్రతి నాకౌట్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమిపాలైంది. ఆఖరికి రిచర్డ్‌ టీవీ అంపైర్‌గా ఉన్న మ్యాచ్‌ల్లో సైతం టీమిండియా విజయం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ అభిమానులు నెట్టింట్లో ఇమేజెస్ చేసి ట్రోల్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు