Cricketer Siddharth Sharma : 28ఏళ్లకే క్రికెటర్ కన్నుమూత.. శోకసంద్రంలో కుటుంబసభ్యులు, సహచరులు

హిమాచల్ ప్రదేశ్ క్రికెటర్ సిద్ధార్ధ్ శర్మ మృతి చెందాడు. అతడి వయసు 28ఏళ్లు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సిద్ధార్ధ్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీలో శర్మ 12 వికెట్లు తీశాడు. గత రెండు వారాలుగా సిద్ధార్ధ్ వెంటిలేటర్ పైనే ఉన్నాడు. గురువారం తుది శ్వాస విడిచాడు.

Cricketer Siddharth Sharma : హిమాచల్ ప్రదేశ్ క్రికెటర్ సిద్ధార్ధ్ శర్మ మృతి చెందాడు. అతడి వయసు 28ఏళ్లు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సిద్ధార్ధ్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచాడు. ప్రస్తుత రంజీ ట్రోఫీలో శర్మ 12 వికెట్లు తీశాడు. గత రెండు వారాలుగా సిద్ధార్ధ్ వెంటిలేటర్ పైనే ఉన్నాడు. గురువారం తుది శ్వాస విడిచాడు.

Also Read..Rishabh Pant Health Update: రిషబ్ పంత్‌కు ముంబై ఆస్పత్రిలో మూడు గంటలు శస్త్రచికిత్స .. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?

గతంలో తన జట్టు విజయ్ హజారే ట్రోఫీ గెలవడంలో శర్మ కీ రోల్ ప్లే చేశాడు. శర్మ చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సిద్ధార్ధ్ శర్మ మృతి పట్ల హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుక్విందర్ సింగ్ సంతాపం తెలిపారు. రాష్ట్రానికి చెందిన ఫాస్ట్ బౌలర్, విజయ్ హజారే ట్రోఫీ విన్నింగ్ జట్టు సభ్యుడు ఇక లేడనే వార్త బాధ కలిగిందన్నారు సీఎం సుక్విందర్. శర్మ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు సీఎం సుక్విందర్.

Also Read..Cricketer Rajashree Swain : అడవిలో చెట్టుకు వేలాడుతున్న మహిళా క్రికెటర్ మృతదేహం.. అనుమానాస్పద స్థితిలో మరణం

ఒక టీ20 గేమ్ లో హిమాచల్ ప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించాడు శర్మ. ఆరు ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఆడాడు. లిస్ట్ ఏ క్రికెట్ ఆడాడు. గతేడాది డిసెంబర్ లో ఈడెన్ గార్డెన్స్ లో బెంగాల్ లో ఆడాడు. అదే అతడి చివరి గేమ్. ఆ గేమ్ లో అతడు 5 వికెట్లు తీసి సత్తా చాటాడు. హిమాచల్ ప్రదేశ్ తరపున 2017-18లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ద్వారా అరంగ్రేటం చేశాడు. రంజీ ట్రోఫీల్లో 25 వికెట్లు తీశాడు. విజయ్ హజారే ట్రోఫీ 2021-22లో లిస్ట్ ఏ క్రికెట్ ఆడాడు. ఆరు మ్యాచుల్లో 8 వికెట్లు తీశాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ట్రెండింగ్ వార్తలు