Cricketer Rajashree Swain : అడవిలో చెట్టుకు వేలాడుతున్న మహిళా క్రికెటర్ మృతదేహం.. అనుమానాస్పద స్థితిలో మరణం

మహిళా క్రికెటర్ మృతదేహం కలకలం రేగింది. మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వెయిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం గురుడిఝాటియాలోని అడవిలో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

Cricketer Rajashree Swain : అడవిలో చెట్టుకు వేలాడుతున్న మహిళా క్రికెటర్ మృతదేహం.. అనుమానాస్పద స్థితిలో మరణం

Cricketer Rajashree Swain : ఒడిశాలో మహిళా క్రికెటర్ మృతదేహం కలకలం రేగింది. మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వెయిన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతదేహం గురుడిఝాటియాలోని అడవిలో ఓ చెట్టుకు వేలాడుతూ కనిపించింది. ఆమె ఒంటిపై గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు.

దీనిపై పోలీస్ కమిషనర్ స్పందించారు. మహిళా క్రికెటర్ మృతిపై కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. దీనిపై లోతైన దర్యాఫ్తు జరుపుతామన్నారు. మరణం వెనుక మిస్టరీని చేధిస్తామన్నారు పోలీస్ కమిషనర్.

Also Read..Kerala Anjushree Death Case : బిర్యానీ తిని యువతి మృతి కేసులో ట్విస్ట్.. అంజుశ్రీ మరణానికి కారణం ఏంటంటే..

”మహిళా క్రికెటర్ రాజశ్రీ స్వైన్ మృతదేహం గురుడిఝాటియా అటవీ ప్రాంతంలో నిర్మానుష్య ప్రదేశంలో చెట్టుకు వేలాడుతూ కనిపించింది. గురుడిఝాటియా పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఏవైనా ఆరోపణలు చేసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కమిషనరేట్ పోలీసులు విచారణ చేపడతారు” అని కటక్ డీసీపీ పినాక్ మిశ్రా తెలిపారు.

”జనవరి 11న జరిగిన సెలక్షన్ క్యాంప్‌కు మహిళా క్రికెటర్ రాజశ్రీ హాజరైంది. ఆ తర్వాత జాడ తెలియకుండా పోయింది. దీనిపై మంగళబాగ్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. క్యాంప్ నుండి క్రికెటర్ రాజశ్రీ ఇంటికి తిరిగి రాకపోవడంతో.. మంగళబాగ్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఇంతలో గురుడిజాటియా ప్రాంతంలో పాడుబడిన స్కూటర్ గుర్తించారు. ఇవాళ క్రికెటర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు” అని డీసీపీ మిశ్రా చెప్పారు. క్రికెటర్ రాజశ్రీది.. పూరీ జిల్లా రాంచండి పోలీస్ పరిధిలోని భుగావ్ గ్రామం.

Also Read..Rapist Jalebi Baba : బాబోయ్.. ఈ జిలేబీ బాబా మామూలోడు కాదు, ఏకంగా 120 మంది మహిళలపై అత్యాచారం

కాగా, రాజశ్రీ మృతిపై ఆమె తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది మర్డర్ అని వారు ఆరోపిస్తున్నారు. నా కూతురిని చంపి ఉరివేశారని రాజశ్రీ తండ్రి ఆరోపించారు. నా సోదరి అత్యుత్తమ క్రీడాకారిణి. అయినా, 10 రోజుల ఎంపిక శిబిరం తర్వాత ఆమెను తుది జట్టులోకి తీసుకోలేదని రాజశ్రీ సోదరి ఆరోపించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

రాజశ్రీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపుతామన్నారు పోలీసులు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే ఆమె మరణానికి ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారించగలమని పోలీసులు స్పష్టం చేశారు.