Pawan Kalyan : ఓజీ డైరెక్టర్ సుజీత్‌కు పవన్ కళ్యాణ్ అదిరిపోయే గిఫ్ట్.. తన జీవితంలో అత్యుత్తమ బహుమతి ఇదేనంటూ..
దర్శకుడు సుజీత్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అదిరిపోయే గిఫ్ట్‌ను అందించారు.
Pawan Kalyan gifts land rover defender car to Director Sujeeth
Pawan Kalyan : దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. ప్రియాంక మోహన్ కథానాయిక. తమన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తి యాక్షన్ ఎంటైర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకున్నారు.
తమ అభిమాన నటుడిని ఎలా చూడాలని అనుకున్నారో దర్శకుడు సుజీత్ అలాగే చూపించడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిసింది. ఇక తనకు మంచి విజయాన్ని అందించిన దర్శకుడు సుజీత్‌కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) తాజాగా అదిరిపోయే గిఫ్ట్‌ను అందించారు.

ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును బహుమతిగా ఇచ్చారు. పవన్ స్వయంగా ఈ కారును సుజీత్‌కు అందించడం విశేషం. ఈ విషయాన్ని సుజీత్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన జీవితంలో అత్యుత్తమ బహుమతి ఇదేనని, మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉందన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Best gift ever ❤️❤️
Overwhelmed and grateful beyond words.
The love and encouragement from my dearest OG, Kalyan garu, means everything to me. From being a childhood fan to this special moment.
Forever indebted 🙏❤️ pic.twitter.com/KuzBY4Jzon— Sujeeth (@Sujeethsign) December 16, 2025
