Honour Killing: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కూతురిని ప్రేమించాడని.. ఇంటికి పిలిచి యువకుడి దారుణ హత్య..

తమ కూతురిని ప్రేమిస్తున్నాడు అన్న కారణంతోనే సాయిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. శ్రీజ తల్లిదండ్రులు సహా కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.

Honour Killing: రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కూతురిని ప్రేమించాడని.. ఇంటికి పిలిచి యువకుడి దారుణ హత్య..

Updated On : December 10, 2025 / 8:36 PM IST

Honour Killing: రంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం అమీన్ పూర్ లో పరువు హత్య కలకలం రేపింది. యువకుడిని యువతి కుటుంబసభ్యులు దారుణంగా కొట్టి చంపేశారు. పెళ్లి పేరుతో ఇంటికి పిలిపించి యువకుడిపై దాడి చేసి హతమార్చారు. బ్యాట్లతో విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర గాయాలతో యువకుడు స్పాట్ లోనే మరణించాడు.

బీరంగూడ ప్రాంతానికి చెందిన శ్రావణ్ సాయి అదే ప్రాంతానికి చెందిన యువతి కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇటీవల యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. పెళ్లి విషయం మాట్లాడదామని యువతి తల్లిదండ్రులు సాయిని ఇంటికి పిలిపించారు. పెళ్లికి అంగీకరిస్తారు అనే నమ్మకంతో సాయి అమ్మాయి ఇంటికి వెళ్లాడు. అయితే, ఇంటికి వెళ్లిన వెంటనే అక్కడి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. శ్రీజ తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యులు కలిసి సాయిపై బ్యాట్లతో విచక్షణారహితంగా దాడి చేశారు.

ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాయి అక్కడికక్కడే కుప్పకూలాడు. తీవ్ర రక్తస్రావంతో కాసేపటికే సాయి మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్ చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తమ కూతురిని ప్రేమిస్తున్నాడు అన్న కారణంతోనే సాయిని హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు.. శ్రీజ తల్లిదండ్రులు సహా కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.

శ్రావణ్ సాయి (20) బీరంగూడ ఇసుకబావికి చెందిన శ్రీజ (19) కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. ఇది శ్రీజ పేరెంట్స్ కు నచ్చలేదు. దీంతో వారు సాయిని పలుమార్లు హెచ్చరించారు. శ్రీజకి దూరంగా ఉండాలన్నారు. అయినా, సాయి వినలేదు. దీంతో ఇద్దరికీ పెళ్లి చేస్తామని, మాట్లాడుకుందామని సాయిని ఇంటికి పిలిపించారు శ్రీజ కుటుంబ సభ్యులు. సాయి ఇంటికి వెళ్లగానే ఒక్కసారిగా దాడి చేశారు.

శ్రావణ్ సాయి మైసమ్మ గూడలోబి సెయింట్ పీటర్ కాలేజీలో బీటెక్ (సీఎస్ఈ) సెకండియర్ చదువుతున్నాడు. కుత్బుల్లాపూర్ లో రూమ్ తీసుకుని నివాసం ఉంటున్నాడు. శ్రావణ్ సాయి, శ్రీజలు పదో తరగతి నుంచి ప్రేమించుకుంటున్నారని తెలిసింది.

Also Read: ఏపీలోని రైతులకు భారీ ఊరట.. రూ. 100 చెల్లిస్తే చాలు.. ఆ భూములు మీ సొంతం..