తండ్రి దినసరి కూలీ, తల్లి చేపలు అమ్మేది.. కొడుకు ఐపీఎల్‌లో కోట్లు సంపాదిస్తున్నాడు.. అయినాగానీ.. ఇతడి గురించి ఎక్కువ మందికి తెలియదు..
తమిళనాడులోని సేలం జిల్లా సమీపంలో చిన్నప్పంపట్టి గ్రామంలో నటరాజన్ (T Natarajan) జన్మించాడు.
Team India unlucky cricketer t natarajan story
T Natarajan : టీమ్ఇండియా తరుపున టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే.. గత కొన్నేళ్లుగా అతడు భారత జట్టులోకి పునరాగమనం చేయాలని చూస్తూ ఉన్నాడు. అతడి తండ్రి దినసరి కూలీ. అతడి తల్లి రోడ్డు పక్కన చేపలు అమ్మేది. ఒకప్పుడు అతడి కుటుంబం జీవితం గడిపేందుకు ఎన్నో కష్టాలు పడింది.
అయితే.. ఐపీఎల్ అతడితో పాటు అతడి కుటుంబ జీవితాన్ని మొత్తం మార్చేసింది. ఐపీఎల్‌తో లక్షాధికారి కావడంతో అతడి జీవితం మారిపోయింది. ఇప్పటికే విషయం మీకు అర్థమై ఉంటుంది మనం మాట్లాడుతుంది టీ.నటరాజన్ గురించి అని.
IND vs SA : గెలుపు జోష్‌లో ఉన్న భారత్‌కు భారీ షాక్.. పండగ చేసుకుంటున్న సౌతాఫ్రికా!
తమిళనాడులోని సేలం జిల్లా సమీపంలో చిన్నప్పంపట్టి గ్రామంలో నటరాజన్ (T Natarajan) జన్మించాడు. కడు పేదరికంలో అతడు పెరిగాడు. అతడి తండ్రి చీరల కర్మాగారంలో రోజువారి కూలీగా పని చేసేవాడు. అతడి తల్లి రోడ్డు పక్కన చేపలు అమ్మేది. అయితే.. 2017లో నటరాజన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ) రూ.3 కోట్లకు సొంతం చేసుకుంది. దీంతో అతడి జీవితం మారిపోయింది.

కోటీశ్వరుడు కావడం వల్ల అతడి కుటుంబ ఆర్థిక పరిస్థితి మారిపోయింది. ఇక అతడు లసిత్ మలింగ, జస్‌ప్రీత్ బుమ్రా లాగా పదునైన యార్కర్లతో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఐపీఎల్‌లో అదరగొట్టడంతో 2020-2021 ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక అయ్యాడు. మూడు పార్మాట్లో భారత్ తరుపున అరంగ్రేటం చేశాడు. అయితే.. కట్ చేస్తే ఐదేళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. చివరి సారిగా అతడు మార్చి 2021లో టీ20, వన్డే సిరీస్‌లో ఆడాడు.
మొత్తంగా టీమ్ఇండియా తరుపున ఓ టెస్టు, నాలుగు టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. టెస్టుల్లో మూడు, టీ20ల్లో ఏడు, వన్డేల్లో మూడు వికెట్లు తీశాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అతడికి ఢిల్లీ ఏడాదికి రూ.10.75 కోట్లు జీతంగా ఇస్తోంది. ఇప్పటి వరకు నటరాజన్ 63 ఐపీఎల్ మ్యాచ్‌లను ఆడాడు. 67 వికెట్లు సాధించాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేసి టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలని నటరాజన్ ఆశిస్తున్నాడు.
