Rishabh Pant Health Update: రిషబ్ పంత్‌కు ముంబై ఆస్పత్రిలో మూడు గంటలు శస్త్రచికిత్స .. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?

ఆపరేషన్ అనంతరం పంత్ బాగానే ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. పంత్ మూడు నుంచి నాలుగు రోజులు వైద్యుల పరిశీలనలో ఉండనున్నాడు. ఆపరేషన్ తర్వాత పంత్ బాగానే స్పందిస్తున్నాడని, త్వరలో పూర్తిగా కోలుకుంటాడని తెలిపారు.

Rishabh Pant Health Update: రిషబ్ పంత్‌కు ముంబై ఆస్పత్రిలో మూడు గంటలు శస్త్రచికిత్స .. ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉందంటే?

Rishabh Pant Health Update

Rishabh Pant Health Update: భారత్ స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ గతేడాది డిసెంబర్ 30న కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఢిల్లీ నుంచి తన సొంత పట్టణం రూర్కీకి వెళ్తుండగా గురుకుల్ నర్సన్ ప్రాంతంలో యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు వెంటనే స్థానికి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అనంతరం డెహ్రాడూన్‌లోని మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పంత్ ముఖంపై చిన్నచిన్న సర్జరీలు చేశారు. రెండుమూడు రోజులు ఐసీయూలో ఉన్నాడు. తరువాత ప్రత్యేక వార్డుకు తరలించారు.

Rishabh Pant Health: మెరుగైన చికిత్సకోసం.. ముంబైకి రిషబ్ పంత్‌

గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. పంత్‌ను ముంబయి తరలించి మెరుగైన చికిత్స అందించేందుకు నిర్ణయించింది. దీనికితోడు కుడికాలు మోకాలిపై శస్త్రచికిత్స చేయాల్సి రావటంతో ముంబైలోని కోకిలాబెన్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం డాక్టర్ దిన్హా పద్రివాలా నేతృత్వంలో పంత్ మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు. ఈ ఆపరేషన్ సుమారు మూడు గంటల పాటు జరిగింది.

Rishabh Pant: తన ప్రాణాలు కాపాడిన ఇద్దరు యువకులతో ఆసుపత్రిలో మాట్లాడిన రిషబ్ పంత్

ఆపరేషన్ అనంతరం పంత్ బాగానే ఉన్నాడని వైద్యులు వెల్లడించారు. పంత్ మూడు నుంచి నాలుగు రోజులు వైద్యుల పరిశీలనలో ఉండనున్నాడు. ఆపరేషన్ తర్వాత పంత్ బాగానే స్పందిస్తున్నాడని, త్వరలో పంత్ పూర్తిగా కోలుకుంటాడని అతని కుటుంబ సభ్యులు తెలిపారు.