Rishabh Pant: తన ప్రాణాలు కాపాడిన ఇద్దరు యువకులతో ఆసుపత్రిలో మాట్లాడిన రిషబ్ పంత్

పంత్ కాస్త కోలుకోవడంతో తనను కాపాడిన రాజత్, నిశును ఆసుపత్రికి పిలిపించుకుని మాట్లాడాడు. పంత్ శరీరం అంతా బ్యాండేజ్ లతో ఉంది. కాగా, పంత్ కు యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతడిని స్థానికులు రాజత్, నిశు కారులో నుంచి బయటకు లాగారు. కారు మంటల్లో కాలిపోయింది.

Rishabh Pant: తన ప్రాణాలు కాపాడిన ఇద్దరు యువకులతో ఆసుపత్రిలో మాట్లాడిన రిషబ్ పంత్

Rishabh Pant

Updated On : January 3, 2023 / 7:55 PM IST

Rishabh Pant: కారు ప్రమాదానికి గురైన తర్వాత తనను కాపాడిన ఇద్దరితో టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ ఇవాళ తాను చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రిలో మాట్లాడాడు. పంత్ ఇటీవల ఘోర కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. మొదట ఐసీయూలో చికిత్స తీసుకున్న రిషబ్ పంత్ ప్రస్తుతం జనరల్ వార్డులో చికిత్స తీసుకుంటున్నాడు.

పంత్ కాస్త కోలుకోవడంతో తనను కాపాడిన రాజత్, నిశును ఆసుపత్రికి పిలిపించుకుని మాట్లాడాడు. పంత్ శరీరం అంతా బ్యాండేజ్ లతో ఉంది. కాగా, పంత్ కు యాక్సిడెంట్ జరిగిన సమయంలో అతడిని స్థానికులు రాజత్, నిశు కారులో నుంచి బయటకు లాగారు.

దీంతో పంత్ ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కారు మంటల్లో కాలిపోయింది. అనంతరం బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ అక్కడకు చేరుకుని అంబులెన్సుకు, పోలీసులకు ఫోన్ చేశాడు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న వ్యక్తి ఎవరన్న విషయం తమకు తెలియదని రాజత్, నిశు మీడియాకు తెలిపారు. అనంతరం పంత్ భారత క్రికెటర్ అని తెలిసిందని చెప్పారు.

India vs Sri Lanka: బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. ఓపెనర్లుగా క్రీజులోకి ఇషాన్, శుభ్‌మన్