Kartik Sharma : ఐపీఎల్ 2026 వేలంలో 14.2 కోట్లు.. ఏడుస్తూనే ఉన్నాను..
ఐపీఎల్ 2026 మినీ వేలంలో రికార్డు స్థాయి మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ (Kartik Sharma ).
Kartik Sharma Reaction after CSK buy him in IPL 2026 Auction
Kartik Sharma : ఐపీఎల్ 2026 మినీ వేలంలో రికార్డు స్థాయి మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల కార్తీక్ శర్మ. 30 లక్షల కనీస ధరతో మంగళవారం అబుదాబి వేదికగా జరిగిన వేలంలోకి వచ్చిన అతడి కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. చివరికి చెన్నై సూపర్ కింగ్స్ 14.20 కోట్ల మొత్తానికి అతడిని సొంతం చేసుకుంది.
అతడితో పాటు ఉత్తరప్రదేశ్ కు చెందిన ప్రశాంత్ వీర్ ను కూడా సీఎస్‌కే 14.20 కోట్లకు దక్కించుకుంది. వీరిద్దరు ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మొత్తం పొందిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లలో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు.
ఇక ఈ మొత్తం సొంతం చేసుకోవడం పట్ల కార్తీక్ శర్మ (Kartik Sharma) స్పందించాడు. వేలం ప్రారంభమైనప్పుడు తాను అవకాశాన్ని కోల్పోతానేమో, తన కోసం ఎవ్వరూ బిడ్ వేయరని అనుకున్నట్లు చెప్పాడు.
అయితే.. ఒక్కసారి బిడ్ వేసాక అది పెరుగుతూ వెలుతున్నప్పుడూ తాను ఏడవడం మొదలుపెట్టినట్లు అతడు చెప్పుకొచ్చాడు. ఇక తనను సీఎస్‌కే దక్కించుకున్న తరువాత కూడా భావోద్వేగంతో, ఆనందంతో తాను ఏడుస్తూను ఉన్నానన్నాడు. తన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకపోతున్నానన్నాడు.
Mangesh Yadav : ఆర్‌సీబీ కోట్లు కుమ్మరించిన మంగేష్ యాదవ్ ఎవరు? అతడి ట్రాక్ రికార్డు ఏంటి?
తన కుటుంబ సభ్యులు, స్నేహితుల మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదన్నాడు. వారందరికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇక తనకు లభించిన దాని పట్ల కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉందన్నాడు. అందరూ సంబురాలు చేసుకుంటున్నారన్నాడు. ఇక దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనితో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
