Hockey World Cup 2023: నేటి నుంచి హాకీ ప్రపంచకప్.. తొలిరోజు నాలుగు మ్యాచ్‌లు.. స్పెయిన్‌ను ఢీకొట్టనున్న భారత్

హాకీ ప్రపంచకప్‌లో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. నాలుగు జట్లును కలిపి నాలుగు పూల్‌లుగా విభజించారు. భారత్ పూల్ డీలో ఉంది. పూల్ డీలో స్పెయిన్, ఇంగ్లండ్, భారత్, వేల్స్ జట్లు ఉన్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో సాగే టోర్నీలో పూల్ లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుతాయి.

India vs Spain

Hockey World Cup 2023: భారత్‌లో మరోసారి హాకీ ప్రపంచ‌కప్ సంబరానికి సయమైంది. శుక్రవారం ఒడిశా వేదికగా 15వ ప్రపంచకప్‌ సమరానికి తెరలేవనుంది. ఎఫ్ఐహెచ్ పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో భాగంగా తొలిరోజు మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరుగుతాయి. మధ్యాహ్నం 1గంటకు భవనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో అర్జెంటీనా – దక్షిణాఫ్రికా పోరుతో మెగా టోర్నీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3గంటలకు ఆస్ట్రేలియా వర్సెస్ ఫ్రాన్స్ మధ్య పోరు జరుగుతుంది. సాయంత్రం 5గంటలకు రవుర్కెలలో కొత్తగా నిర్మించిన బిర్సాముండా స్టేడియంలో ఇంగ్లాండ్ వర్సెస్ వేల్స్ జట్లు తలపడనున్నాయి. ఇక రాత్రి 7గంటలకు ఇండియా వర్సెస్ స్పెయిన్ మధ్య పోరు జరగనుంది.

Hockey World Cup 2023: హాకీ ప్రపంచ కప్ విలేజ్‌ను ప్రారంభించిన ఒడిశా సీఎం.. గెలిస్తే రూ.కోటి చొప్పున ఇస్తానన్న పట్నాయక్

ఈ మెగా టోర్నీలో మొత్తం 16 జట్లు పాల్గొంటున్నాయి. నాలుగు జట్లును కలిపి నాలుగు పూల్‌లుగా విభజించారు. భారత్ పూల్ డీలో ఉంది. పూల్ డీలో స్పెయిన్, ఇంగ్లండ్, భారత్, వేల్స్ జట్లు ఉన్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్లో సాగే టోర్నీలో పూల్ లో అగ్రస్థానంలో నిలిచిన జట్లు క్వార్టర్స్ చేరుతాయి. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్లు క్రాస్ ఓవర్స్ లో తలపడతాయి. సెమీస్, ఫైనల్ సహా కళింగ స్టేడియంలో 24 మ్యాచ్ లు నిర్వహిస్తారు. బిర్సా ముండా స్టేడియంలో మరో 20 మ్యాచ్లు జరుగుతాయి.

FIH Odisha Hockey : హాకీ పురుషుల ప్రపంచ కప్ అధికారిక లోగో ఆవిష్కరణ..

భారత హాకీ జట్టు ప్రారంభంలోనే బలమైన స్పెయిన్ జట్టును ఢీకొట్టనుంది. ర్యాంకింగ్ విభాగంలో భారత్ 6వ స్థానంలో ఉండగా, స్పెయిన్ 8వ స్థానంలో ఉంది. అయితే, ర్యాంకింగ్ పరంగా తక్కువగా ఉన్నప్పటికీ స్పెయిన్ బలమైన జట్టు. భారత్, స్పెయిన్ జట్లు 2022లో నాలుగు సార్లు తలపడ్డాయి. స్పెయిన్ రెండు సార్లు గెలుపొందగా, భారత్ ఒకసారి విజయం సాధించింది. అయితే, ఈ రోజు మ్యాచ్‌లో విజయం సాధిస్తామనే ధీమాతో భారత ఆటగాళ్లు ఉన్నారు. ఇదిలాఉంటే అంతర్జాతీయ హాకీలో జట్లు మొత్తం 67సార్లు తలపడ్డాయి. భారత్ 28 సార్లు, స్పెయిన్ 25 సార్లు గెలిచాయి. 14 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి. ఇదిలాఉంటే ఇప్పటి వరకు అన్ని ప్రపంచ‌కప్‌లలో పోటీపడ్డ దేశాలు భారత్, నెదర్లాండ్స్, స్పెయిన్ మాత్రమే.