Hong Kong Cricketer: మ్యాచ్ అనంతరం స్నేహితురాలికి లవ్ ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్ .. ఆమె ఎలా రియాక్టయిందంటే.. వీడియో వైరల్

ఆసియా కప్ -2022 టోర్నీలో భాగంగా బుధవారం ఇండియా వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. మ్యాచ్ అనంతరం హాంకాంగ్ క్రికెటర్ కించత్ తన స్నేహితురాలికి లవ్ ప్రపోజ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kinchit Shah

Hong Kong Cricketer: ఆసియా కప్ -2022 టోర్నీలో భాగంగా బుధవారం ఇండియా వర్సెస్ హాంకాంగ్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హాంకాంగ్ 40 పరుగుల తేడాతో ఇండియాపై ఓటమిపాలైంది. మ్యాచ్ ఓడిపోయినప్పటికీ మ్యాచ్ అనంతరం హాంకాంగ్ బ్యాట్స్‌మెన్ కించిత్ షా రాత్రి గుర్తుండిపోయే పనిచేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత కించిత్ నేరుగా స్టాండ్స్‌లో ఉన్న తన స్నేహితురాలి వద్దకు వెళ్లాడు. ఆమెకు తన ప్రేమను ప్రపోజ్ చేసి ఒక్కసారిగా ఆశ్చర్చపర్చాడు.

Hong Kong: ఆసియా కప్‌‌కు క్వాలిఫై అయిన హాంకాంగ్.. గ్రూప్ – Aలో భారత్, పాక్‌తో ఢీ

కించిత్ షా తన స్నేహితురాలికి లవ్ ప్రపోజ్ చేసే వీడియోను ఆసియా క్రికెట్ కౌన్సిల్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియో ప్రకారం.. మ్యాచ్ ముగిసిన అనంతరం స్టాండ్ లో ఉన్న తన స్నేహితురాలి వద్దకు నేరుగా వెళ్లాడు. ఆమె వద్దకు వెళ్లి మోకాళ్లపై కూర్చొని రింగును తీసి చూపించాడు. కించిత్ అలా చేయడాన్ని చూసి తొలుత ఆమె కంగారుపడింది. తరువాత ఆమె పెద్దగా నవ్వుతూ నేను దీన్ని నమ్మలేక పోతున్నాను అని పెదేపదే చెప్పడం వినొచ్చు.

అనంతరం ఆమె అఫ్ కోర్స్ అంటూ బదులివ్వడంతో సంతోషంగా ఇద్దరూ ఒకరినొకరు అలింగనం చేసుకున్నారు. అనంతరం కించిత్ ఆమెకు ఉంగరాన్ని ధరించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ‘మ్యాచ్ పోతే పోయింది .. గర్ల్స్‌ఫ్రెండ్ ఓకే చెప్పిందిలే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.