క్రికెట్ అభిమానుల‌కు గుడ్‌న్యూస్‌‌.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లు మీ ఫోన్లో ఉచితంగా చూడొచ్చు.. ఎలా అంటే?

ఉచితంగా మ్యాచ్ లు చూడాలంటే కేవలం మొబైల్ ఫోన్ లో మాత్రమే సాధ్యమవుతుంది. స్మార్ట్ టీవీ, ల్యాప్ టాప్ లలో ఉచితంగా మ్యాచ్ లను వీక్షించడం సాధ్యం కాదు.

T20 World Cup 2024 : ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 టోర్నీ యూఎస్ఏ, వెస్టిండీస్ వేదికగా జరగనుంది. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడుతుంది. జూన్ 9న దాయాది జట్టు పాకిస్థాన్ తో తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ లో మ్యాచ్ లకోసం క్రికెట్ ఫ్యాన్స్ ఉత్సకతతో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో డిస్నీ హాట్‌స్టార్‌ వారికి గుడ్ న్యూస్ చెప్పింది. హాట్‌స్టార్‌ లో ఉచితంగా మ్యాచ్ లను చూసే అవకాశం కల్పించింది.

Also Read : WPL 2024 : భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. ఆ బాల్ వెళ్లి ఎక్కడ తగిలిందో తెలుసా?.. వీడియో వైరల్

టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లు మీరు ఉచితంగా చూడాలనుకుంటే.. హాట్ స్టార్ లో అన్ని మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారంతో చూడొచ్చు. కేవలం మొబైల్ ఫోన్ లో మాత్రమే ఉచితంగా మ్యాచ్ లు చూసేందుకు సాధ్యమవుతుంది. మీ మోబైల్ లో డిస్నీ హాట్ స్టార్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని రిజిస్ట్రర్ అయ్యి ఫ్రీగా మ్యాచ్ లు చూడొచ్చు. స్మార్ట్ టీవీ, ల్యాప్ టాప్ లలో ఉచితంగా మ్యాచ్ లను వీక్షించడం సాధ్యం కాదు. అలా చూడాలంటే మీరు హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ చేసుకొని ఉండాలి.

Also Read : WPL 2024 : భారీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ బ్యాటర్.. ఆ బాల్ వెళ్లి ఎక్కడ తగిలిందో తెలుసా?.. వీడియో వైరల్

లీగ్ దశలో భారత్  ఆడే మ్యాచ్ ల షెడ్యూల్ ..
జూన్ 5న : భారత్ వర్సెస్ ఐర్లాండ్ (నూయార్క్ లో రాత్రి 8గంటలకు)
జూన్ 9న : భారత్ వర్సెస్ పాకిస్థాన్ (నూయార్క్ లో రాత్రి 8గంటలకు)
జూన్ 12న : భారత్ వర్సెస్ యునైటెడ్ స్టేట్స్ (నూయార్క్ లో రాత్రి 8గంటలకు)
జూన్ 15న : భారత్ వర్సెస్ కెనడా (ప్లోరిడాలో రాత్రి 8గంటలకు)

 

 

ట్రెండింగ్ వార్తలు