Pakistan : భార‌త్ చేతిలో ఘోర ఓట‌మి.. అదే జ‌రిగితే ఆసియాక‌ప్ 2025 నుంచి పాక్ ఔట్‌!

ఆదివారం భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పాక్ (Pakistan) చిత్తుగా ఓడింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నెట్‌ర‌న్‌రేటు తీవ్రంగా ప్ర‌భావిత‌మైంది.

How can Pakistan get knocked out of Asia Cup 2025 after loss to India

Pakistan : ఆసియాక‌ప్ 2025లో భాగంగా ఆదివారం దుబాయ్ వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పాక్ చిత్తుగా ఓడిపోయింది. పాక్ నిర్దేశించిన 128 ప‌రుగుల ల‌క్ష్యాన్ని భార‌త్ మ‌రో 25 బంతులు మిగిలి ఉండ‌గా అంటే 15.5 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమ్ఇండియా విజ‌యం సాధించ‌డంతో సూపర్‌-4లో దాదాపుగా అడుగుపెట్టిన‌ట్లే. త‌మ ఆఖ‌రి లీగ్ మ్యాచ్‌ను సెప్టెంబ‌ర్ 19న ఒమ‌న్‌తో ఆడ‌నుంది.

మ‌రోవైపు పాక్ జ‌ట్టు భార‌త్ చేతిలో చిత్తుగా ఓడ‌డం ఆ జ‌ట్టు నెట్‌ర‌న్‌రేటుపై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింది. ప్ర‌స్తుతానికి రెండు మ్యాచ్‌లు ఆడిన పాక్.. ఓ మ్యాచ్‌లో గెల‌వ‌గా, మ‌రో మ్యాచ్‌లో ఓడిపోయి పాయింట్ల ప‌ట్టిక‌లో రెండో స్థానంలో కొన‌సాగుతోంది. అయిన‌ప్ప‌టికి ఆసియా క‌ప్ నుంచి సూప‌ర్‌-4కి అర్హ‌త సాధించ‌కుండానే పాక్ నిష్ర్క‌మించే అవ‌కాశాలు ఉన్నాయి.

IND vs PAK : ప్రెజెంటేషన్ వేడుక‌కు రానీ పాక్ కెప్టెన్‌.. కోచ్ ఏమ‌న్నాడంటే..?

పాక్ సూప‌ర్‌-4 అర్హ‌త సాధించాలంటే.. త‌మ చివ‌రి లీగ్ మ్యాచ్‌లో యూఏఈతో సెప్టెంబ‌ర్ 17న జ‌రిగే మ్యాచ్‌లో విజ‌యం సాధించాలి. ఒక‌వేళ ఈ మ్యాచ్‌లో పాక్ ఓడిపోతే క‌ష్టాలు త‌ప్ప‌వు.

ఇదే జ‌రిగితే ఆసియాక‌ప్‌-4 నుంచి పాక్ ఔట్‌..

* యూఏఈ జ‌ట్టు సోమ‌వారం (సెప్టెంబ‌ర్ 15)న ఒమ‌న్‌తో ఆడ‌నుంది. ఈ మ్యాచ్‌లో యూఏఈ విజ‌యం సాధించి సెప్టెంబ‌ర్ 17న పాక్‌తో మ్యాచ్‌లోనూ గెలిచిన‌ట్ల‌యితే అప్పుడు నాలుగు పాయింట్ల‌తో యూఏఈ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచి సూప‌ర్-4లో అడుగుపెడుతుంది.

ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో యూఏఈ నాలుగో స్థానంలో ఉంది. ఆ జ‌ట్టు ర‌న్‌రేటు కూడా -10.48గా ఉంది. అయితే.. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో యూఏఈ గెలిస్తే అప్పుడు నెట్‌ర‌న్‌రేటుతో సంబంధం లేకుండా ఆ జ‌ట్టు సూప‌ర్ -4లో అడుగుపెడుతుంది.

* ఒక‌వేళ ఒమ‌న్ ప్ర‌స్తుతం గ్రూప్ టాప‌ర్‌గా ఉన్న భార‌త్ తో పాటు, యూఏఈల‌ను ఓడించి, యూఏఈ చేతిలో పాక్ ఓడిపోతే అప్పుడు కూడా పాక్ ఆసియాక‌ప్ నుంచి ఔట్ అవుతుంది. ఒమ‌న్‌తో పాటు భార‌త్ సూప‌ర్‌-4కి చేరుతాయి.

IND vs PAK : భార‌త్‌తో అట్టుంట‌ది మ‌రీ.. పాక్ కెప్టెన్ మైండ్ బ్లాక్‌.. దెబ్బ‌కు ముఖం చాటేశాడు.

* ఒక‌వేళ యూఏఈని ఒమ‌న్ ఓడించి అదే స‌మ‌యంలో పాక్‌ను యూఏఈ ఓడిస్తే.. అప్పుడు నెట్‌ర‌న్‌రేటు కీల‌కం అవుతోంది. మెరుగైన నెట్‌ర‌న్ ఉన్న జ‌ట్టు రెండో స్థానంతో టోర్నీలో ముంద‌డుగు వేస్తుంది.

ట్రై సిరీస్‌లో పాక్‌ను ఇబ్బంది పెట్టిన యూఏఈ

ఆసియాక‌ప్‌2025 ముందు పాక్‌, యూఏఈ, అఫ్గానిస్తాన్ జ‌ట్లు ట్రై సిరీస్‌లో పాల్గొన్నాయి. ఈ ట్రై సిరీస్‌లో జ‌రిగిన మ్యాచ్‌ల్లో ప‌లుమార్లు యూఏఈ జ‌ట్టు పాక్‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఈ రెండు మ్యాచ్‌ల్లో పాక్ విజ‌యం సాధించిన‌ప్ప‌టికి అనిశ్చితికి మారుపేరైన టీ20ల్లో యూఏఈని త‌క్కువ అంచ‌నా వేయ‌డానికి వీలులేదు. త‌మ‌దైన రోజున ఎలాంటి జ‌ట్ల‌కు అయినా షాక్ ఇవ్వ‌గ‌ల‌దు.

మ‌రోవైపు గ‌తంలో పాక్ సైతం అమెరికా, జింబాబ్వే చేతుల్లో ఓడిపోయి మెగాటోర్నీల నుంచి నిష్ర్క‌మించిన సంగ‌తి తెలిసిందే.