IPL 2025: హైదరాబాద్ కొంపముంచిన వరుణుడు.. ప్లేఆఫ్ రేసు నుంచి SRH నిష్క్రమణ

ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్ రేస్ నుంచి నిష్క్రమించాయి.

Courtesy BCCI

IPL 2025 : ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కథ ముగిసింది. ఎస్ఆర్ హెచ్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. కీలక మ్యాచ్ లో వర్షం హైదరాబాద్ కొంప ముంచాడు. భారీ వర్షం కారణంగా హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ రద్దైంది. దీంతో 2 జట్లకు చెరో పాయింట్ లభించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో హైదరాబాద్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేశారు. ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 133 పరుగులే చేసింది. దీంతో ఈ మ్యాచ్ లో హైదరాబాద్ గెలవడం ఖాయం అని ఫ్యాన్స్ ఆశించారు. అయితే వరుణుడు కొంపముంచాడు.

Also Read: పంజాబ్ చేతిలో ఓడినా.. ప్లేఆఫ్స్ చేరుకునేందుకు ల‌క్నోకు ఛాన్సుంది.. ఆ ఒక్క ప‌ని చేస్తే చాలు..

రెండో ఇన్నింగ్స్ లో ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దైంది. దీంతో ఎస్ ఆర్ హెచ్ ఖాతాలో ఒక పాయింట్ చేరింది. కానీ ఎలాంటి ప్రయోజనం లేదు. ఎస్ ఆర్ హెచ్ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించాయి. తాజాగా మూడో జట్టుగా ఎస్ ఆర్ హెచ్ చేరింది. గతేడాది ఐపీఎల్ లో రన్నరప్ గా నిలిచిన SRH.. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్ రేస్ నుంచి వైదొలిగిన మూడో జట్టుగా నిలిచింది.

ఈ సీజన్ లో ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడిన SRH 3 మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. ఏడు మ్యాచుల్లో ఓటమి పాలైంది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఏడు పాయింట్లతో టేబుల్ లో 8వ స్థానంలో నిలిచింది. అటు ఢిల్లీ క్యాపిటల్స్ మొత్తం 11 మ్యాచులు ఆడింది. ఆరు మ్యాచుల్లో గెలిచింది, 4 మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. 13 పాయింట్లతో టేబుల్ లో 5వ ప్లేస్ లో ఉంది DC.