SRH vs RCB : బెంగ‌ళూరుతో స‌న్‌రైజ‌ర్స్‌ మ్యాచ్‌.. హైద‌రాబాద్ మెట్రో కీల‌క నిర్ణ‌యం.. క్రికెట్ ఫ్యాన్స్‌కు పండ‌గే..

హైద‌రాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

SRH vs RCB – Hyderabad Metro : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో మ్యాచులు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి. ఉప్ప‌ల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో గురువారం రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు త‌ల‌ప‌డ‌నుంది. రాత్రి 7.30 గంట‌ల‌కు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (HMRL) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.

ఉప్ప‌ల్ మార్గంలో మెట్రో రైళ్ల స‌మ‌యాన్ని పొడిగిస్తున్న‌ట్లు చెప్పింది. నాగోల్, ఉప్పల్‌ స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేష‌న్‌లలో చివ‌రి రైళ్లు రాత్రి 12:15 గంట‌ల‌కు బ‌య‌ల్దేరి 1:10 గంట‌ల‌కు గ‌మ్యస్థానాలకు చేరుకుంటుంది అని మెట్రో అధికారులు తెలిపారు.

MS Dhoni : ధోనికి కోప‌మొచ్చింది..! ‘నన్నెందుకు చూపిస్తున్నావు.. కొట్టేస్తా మిమ్మ‌ల్ని’

“హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపిఎల్ మ్యాచ్ కోసం మాత్రమే ఉప్పల్, స్టేడియం, ఎన్‌జిఆర్‌ఐ మెట్రో స్టేషన్‌లలో షెడ్యూల్ అవర్స్‌కి మించి ప్రవేశానికి అనుమతి ఉంది. ఇతర స్టేషన్లలో నిష్క్రమణలు మాత్రమే అందుబాటులో ఉంటాయి” అని హైదరాబాద్ మెట్రో రైలు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఇదిలా ఉంటే.. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఏడు మ్యాచులు ఆడింది. ఐదు మ్యాచుల్లో విజ‌యం సాధించింది. 10 పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో మూడో స్థానంలో కొన‌సాగుతోంది. మ‌రోవైపు రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. 8 మ్యాచులు ఆడ‌గా ఏడింటిలో ఓడిపోయింది. రెండు పాయింట్ల‌తో ప‌ట్టిక‌లో ఆఖ‌రి స్థానంలో కొన‌సాగుతోంది.

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు భార‌త జ‌ట్టు.. సంజూశాంస‌న్‌, కేఎల్ రాహుల్‌ల‌కు జ‌ట్టులో చోటు ఇవ్వ‌ని ఇర్ఫాన్ ప‌ఠాన్‌

కాగా.. ఉప్ప‌ల్‌లో జ‌రిగే మ్యాచ్‌లో విజ‌యం సాధించి ప్లే ఆఫ్స్ దిశ‌గా మ‌రో అడుగు వేయాల‌ని హైద‌రాబాద్ ప‌ట్టుద‌ల‌గా ఉండ‌గా.. ప‌ట్టిక‌లో త‌న స్థానాన్ని మెరుగుప‌ర‌చుకోవాల‌ని ఆర్‌సీబీ అనుకుంటోంది.

ట్రెండింగ్ వార్తలు