అందరిలాంటివాడినే : మిస్టర్ కూల్ గా రాణించడం వెనుక రహస్యం చెప్పిన మహీ

కెప్టెన్‌ కూల్‌ గా రాణించడం వెనుక ఉన్న అసలు రహస్యాన్నిబయటపెట్టాడు మహేంద్ర సింగ్‌ ధోని. తాను కూడా మనిషినే..  అందరిలాంటివాడినేనని, తనకు కూడా భావోద్వేగాలు ఉంటాయని, సామాన్యుడిలానే ఆలోచిస్తానన్నారు మహీ. అయితే నెగిటీవ్ ఆలోచనలను నియంత్రించే విషయంలో ఇతరులకన్నా కాస్త బెటర్‌ గా ఉంటానని టీమిండియా మాజీ కెప్టెన్.

గడ్డు పరిస్థితులు ఎదురైన సమయంలో అందరిలానే తనకు నిరాశ ఆవహిస్తుందని.. చాలా సార్లు కోపం వస్తుంటుందన్నారు. అయితే భావోద్వేగాలను నియంత్రించుకుంటూ అవేశపడకుండా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తుంటానని ధోని చెప్పాడు. టెస్ట్ మ్యాచ్ అయితే తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడానికి కాస్త సమయం దొరుకుతుందని, అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మరీ ముఖ్యంగా టీ20ల్లో నిర్ణయాలను వేగంగా తీసుకోవాలన్నారు.

ఓవర్‌ ఓవర్‌కు, బంతి బంతికి మ్యాచ్‌ సమీకరణాలు మారిపోతాయని, దీంతో మన మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేయాలన్నారు. వేగంగా, వ్యూహాత్మకంగా, ప్రత్యర్థి జట్లకు భిన్నంగా ఆలోచించినప్పుడే విజయం సాధిస్తాం. నేను సారథిగా ఉన్నప్పుడు ఎక్కువగా ప్రత్యర్థి వ్యూహాలను పసిగడుతూ వ్యూహాలకు పదను పెట్టేవాడినని ధోని చెప్పాడు. 

ట్రెండింగ్ వార్తలు