Venkatesh Iyer : వెంక‌టేష్ అయ్య‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఎక్కువ డ‌బ్బులిచ్చారు క‌దా అని..

కేకేఆర్ బ్యాట‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు.

Courtesy BCCI

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ జ‌ట్టు రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 80 ప‌రుగుల తేడాతో విజ‌యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో కేకేఆర్ బ్యాట‌ర్ వెంక‌టేష్ అయ్య‌ర్ హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. కేవ‌లం 29 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స‌ర్ల సాయంతో 60 ప‌రుగులు చేశాడు.

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో అత్యంత ఖ‌రీదైన ఆట‌గాళ్ల జాబితాలో వెంకటేష్ అయ్య‌ర్ మూడో స్థానంలో ఉన్నాడు. అయ్య‌ర్‌ను వేలంలో కేకేఆర్ రూ.23.75 కోట్ల‌కు సొంతం చేసుకుంది. కాగా ఈ ఆట‌గాడు తొలి మూడు మ్యాచ్‌ల్లో 9 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఈ క్ర‌మంలో అత‌డి పై విమ‌ర్శ‌లు రాగా.. స‌న్‌రైజ‌ర్స్‌తో మ్యాచ్‌లో త‌న బ్యాట్‌తోనే వాటికి స‌మాధానం ఇచ్చాడు.

SRH playoffs scenario : వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో ఓట‌మి.. స‌న్‌రైజ‌ర్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఛాన్సుందా? ఇంకా ఎన్ని మ్యాచ్‌ల్లో గెల‌వాలంటే..?

ఇక మ్యాచ్ అనంత‌రం అయ్య‌ర్ మాట్లాడుతూ.. డ‌బ్బులు ఎక్కువ ఇచ్చారు గ‌దా అని ప్ర‌తి మ్యాచ్‌లోనూ ప‌రుగులు చేయాల‌ని దాని అర్థం కాద‌న్నాడు. ఒక్క సారి ఐపీఎల్ మ్యాచ్‌లు ఆరంభ‌మైన త‌రువాత ఓ ప్లేయర్ అమ్ముడైంది రూ.20ల‌క్ష‌ల‌కా? రూ.20 కోట్ల‌కా ? అనేది అవ‌స‌రం లేద‌న్నాడు. ఓ ఆట‌గాడు జ‌ట్టు విజ‌యం కోసం ఏం చేస్తున్నాడో అన్న‌దే ముఖ్య‌మ‌న్నాడు.

తాను ఎల్ల‌ప్పుడు జ‌ట్టు విజ‌యంలో భాగ‌స్వామ్యం అయ్యేందుకు మాత్ర‌మే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని అయ్య‌ర్ చెప్పుకొచ్చాడు. మ్యాచ్‌లో కొన్ని బంతులే ఉన్న‌ప్పుడు దూకుడుగా ఆడేందుకు ప్ర‌య‌త్నిస్తాన‌ని, అప్పుడు ప‌రుగులు చేయ‌లేక‌పోయినా.. వేగంగా ఆడే ప్ర‌య‌త్నం మాత్రం ముఖ్య‌మ‌న్నాడు.

Pakistan : వ‌న్డే సిరీస్‌ను కోల్పోయిన పాకిస్తాన్‌కు ఐసీసీ షాక్ .. భారీ జ‌రిమానా..

ఐపీఎల్ అంటేనే ఒత్తిడి ఉంటుంద‌ని, జ‌ట్టు విజ‌యం కోసం ఏం చేశామ‌నేదే ముఖ్యం అని, ఆ విష‌యంలో మాత్రం తాను వెనుక‌డుగు వేసే ప్ర‌స‌క్తే లేద‌న్నాడు.