SRH playoffs scenario : వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి.. సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్‌కు వెళ్లేందుకు ఛాన్సుందా? ఇంకా ఎన్ని మ్యాచ్‌ల్లో గెలవాలంటే..?
వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసిందా?

PIC Credit @ SRH
ఐపీఎల్ 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. సంచలన విజయాలో ఫైనల్ దూసుకువెళ్లింది. అయితే.. ఆఖరి మెట్టు పై బోల్తా పడింది. ఫైనల్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. దీంతో ఐపీఎల్ 2025 సీజన్‌లో ట్రోఫీనే లక్ష్యంగా బరిలోకి దిగింది.
తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను చిత్తు చేసి ఈ సీజన్‌లో ఘనంగా బోణీ కొట్టింది. అయితే.. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. లక్నో, ఢిల్లీ, కేకేఆర్ చేతుల్లో ఓడిపోవడంతో ఎస్ఆర్‌హెచ్ జట్టు సత్తా పై సందేహలు మొదలు అయ్యాయి.
Rishabh Pant : పంత్ వైఫల్యానికి అసలు కారణం అదేనా? ఇంకెన్నాళ్లిలా?
పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో..
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు సన్‌రైజర్స్ జట్టు నాలుగు మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఓ మ్యాచ్‌లో గెలవగా, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి. ఇక నెట్‌రన్‌రేటు -1.612గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.
తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ పై 286 పరుగులతో సత్తా చాటడంతో ఈ సీజన్‌లో ఖచ్చితంగా ఎస్ఆర్‌హెచ్ 300 కొడుతుందని ఫ్యాన్స్ ఆశించారు. అయితే.. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి బ్యాటర్ సైతం హిట్టింగే లక్ష్యంగా బ్యాటింగ్ చేయడం సన్‌రైజర్స్ కొంపముంచుతోంది. ఇక వరుస ఓటముల నుంచి బయట పడి గెలుపు బాట పట్టుకుంటే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ ఆఫ్ చేరుకోవడం కష్టమే.
ఎస్ఆర్‌హెచ్ ప్లేఆప్స్ చేరుకోవాలంటే..?
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ మరో 10 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. గత సీజన్లలోని సమీకరణాలు తీసుకుంటే.. ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిచిన జట్లు దాదాపుగా ఫ్లే ఆఫ్స్ బెర్తును ఖాయం చేసుకున్నాయి. ఆ లెక్కన సన్‌రైజర్స్ మిగిలిన 10 మ్యాచ్‌ల్లో కనీసం ఏడు మ్యాచ్‌ల్లో గెలవాల్సి ఉంది. ప్రస్తుతం ఎస్ఆర్‌హెచ్ ఫామ్ తీసుకుంటే ఇది అంత సలువు కాదు. ఇంకా టోర్నీ ప్రారంభ దశలో ఉన్నాం కాబట్టి సన్‌రైజర్స్ పరిస్థితులను అర్థం చేసుకుని మేల్కొంటే ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే రానున్న రోజుల్లో ప్లే ఆఫ్స్ రేసు ఉత్కంఠగా మారనుంది.