కేంద్రానికి సైనా రిక్వెస్ట్: అర్జెంటుగా డెన్మార్క్ వీసా ఇప్పించండి

కేంద్రానికి సైనా రిక్వెస్ట్: అర్జెంటుగా డెన్మార్క్ వీసా ఇప్పించండి

Updated On : October 8, 2019 / 4:45 AM IST

భారత టాప్ షట్లర్ సైనా నెహ్వాల్ చిక్కుల్లో పడింది. ఇటీవల ఫిట్‌నెస్ సమస్యతో బాధపడుతూ దానిని అధిగమించి డెన్మార్క్ ఓపెన్ టోర్నీలో ఆడేందుకు సిద్ధమైన ఆమెకు వీసా సమస్య ఎదురైంది. అక్టోబరు 15 నుంచి 20వరకూ జరగనున్న బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ 750 టోర్నమెంట్‌ ఆధ్వర్యంలో డెన్మార్క్ ఓపెన్ జరగనుంది. 

‘నాకూ, నా ట్రైనర్‌కు డెన్మార్క్‌కు వెళ్లేందుకు అర్జెంట్‌గా వీసా ఇప్పించండి. వచ్చే వారం అక్కడ టోర్నమెంట్ ఆడాల్సి ఉంది. ఇప్పటివరకూ మాకు వీసా రాలేదు. వచ్చే వారం మంగళవారం నుంచి మా మ్యాచ్ మొదలవనుంది’ అని విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్‌కు సైనా నెహ్వాల్ ట్వీట్ చేశారు. 

సైనా భర్త, వ్యక్తిగత కోచ్ అయిన కశ్యప్ ఇలా మాట్లాడారు. ‘ సైనా గ్యాస్ట్రోఎంటరిటీస్‌తో
 బాధపడుతోంది. వాంతులు కూడా అవడంతో కాస్త నలతగా ఉన్నట్టు కనిపిస్తోంది. హాస్పిటల్ నుంచి నేరుగా తను స్టేడియానికే వెళ్లి ప్రాక్టీస్ చేసింది. ఈ సంవత్సరం అంతా కష్టంగానే గడిచిందనుకుంటాను. టోర్నీలో మూడు గేమ్‌లు గెలిస్తే తాను టోర్నీ తప్పక గెలుస్తుంది’ అని చెప్పుకొచ్చాడు.