Natarajan: ‘రీ ఎంట్రీ చేయాలనుకుంటున్నా, కానీ భయంగా ఉంది’

తమిళనాడు పేసర్ టి.నటరాజన్ పునరాగమనం వాస్తవమేనని స్పష్టం చేశాడు. 2022 వేలం తన టీ20 వరల్డ్ కప్ కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని పక్కకుపెట్టానని చెప్తున్నాడు.

Natarajan: ‘రీ ఎంట్రీ చేయాలనుకుంటున్నా, కానీ భయంగా ఉంది’

Natarajan

Updated On : February 7, 2022 / 5:30 PM IST

Natarajan: తమిళనాడు పేసర్ టి.నటరాజన్ పునరాగమనం వాస్తవమేనని స్పష్టం చేశాడు. 2022 వేలం తన టీ20 వరల్డ్ కప్ కెరీర్ కు ఎలా ఉపయోగపడుతుందనే విషయాన్ని పక్కకుపెట్టానని చెప్తున్నాడు. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం కష్టపడి పనిచేయడం, బౌలర్ గా మెరుగవడంపైనే ఉందని వివరించాడు.

నటరాజన్ చివరిసారిగా మార్చి 2021లో అంతర్జాతీయ క్రికెట్ ఆడగా… ఆ సిరీస్‌లో మోకాలి గాయం కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది. మొత్తం IPL సీజన్, చాలా దేశీవాళీ టోర్నమెంట్‌లకు దూరంగా ఉన్నాడు. మూడు ఫార్మాట్లలో స్థానాన్ని కోల్పోయాడు.

బలాబలాలపై దృష్టి సారిస్తే, మిగతావన్నీ మళ్లీ స్థానంలో పడతాయని పేసర్ అభిప్రాయపడ్డాడు.

Read Also : ఒక్కొక్కరి ఖాతాలోకి రూ.10వేలు.. రేపు జగనన్న చేదోడు రెండో విడత జమ

‘నేను IPLవేలం గురించి పెద్దగా ఆలోచించడం లేదు. నేను నా బలాలపై ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. కష్టపడి పని చేయాలనుకుంటున్నా. చాలా విరామం తర్వాత తిరిగి రావాలనుకుంటున్నా. ఈ విషయంలో నేను భయపడుతున్నాననే మాట వాస్తవమే’ అని వెల్లడించాడు.

ఆస్ట్రేలియాలో జరిగిన 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో నటరాజన్ మోకాలికి గాయమైంది. ఇంగ్లాండ్ సిరీస్‌కు కొన్ని వారాల తర్వాత ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించాడు.