Ibrahim Zadran
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో అఫ్గానిస్థాన్ సంచలన విజయాలతో దూసుకుపోతుంది. తాజాగా ఆ జట్టు బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌లో సెంచరీ చేసిన మొదటి అఫ్గానిస్థాన్ ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కాడు. ముంబైలోని వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 131 బంతుల్లో శతకం చేయడం ద్వారా ఇబ్రహీం జద్రాన్ ఈ ఘనత అందుకున్నాడు. 2015 నుంచి వన్డే ప్రపంచకప్‌లలో అఫ్గానిస్థాన్ ఆడుతోంది. ఇప్పటి వరకు కూడా ఒక్క అఫ్గాన్ బ్యాటర్ మెగాటోర్నీలో శతకం చేయలేదు. ఇప్పుడు ఆ లోటును జద్రాన్ తీర్చాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 143 బంతులు ఎదుర్కొన్న అతడు 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 129 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
ప్రపంచకప్‌లలో అఫ్గానిస్థాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..
ఇబ్రహీం జద్రాన్ – 129* పరుగులు – ఆస్ట్రేలియా పై ముంబైలో 2023 (నేటి మ్యాచ్లో)
సమీవుల్లా షిన్వారీ – 96 పరుగులు – స్కాట్లాండ్ పై డునెడిన్‌లో 2015
ఇబ్రహీం జద్రాన్ – 87 పరుగులు – పాకిస్థాన్ పై చెన్నైలో 2023
ఇక్రమ్ అలీఖిల్ – 86 పరుగులు – వెస్టిండీస్ పై లీడ్స్‌లో 2019
ODI World Cup 2023 : టైమ్డ్ ఔట్ అంటూ అప్పీల్ చేసిన బంగ్లాదేశ్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్ నుంచి షకీబ్ ఔట్..
హష్మతుల్లా షాహిదీ – 80 పరుగులు – భారత్ పై ఢిల్లీలో 2023
రహ్మానుల్లా గుర్బాజ్ – 80 పరుగులు – ఇంగ్లాండ్ పై ఢిల్లీలో 2023
ఆ జాబితాలో చోటు దక్కించుకున్న ఇబ్రహీం జద్రాన్
తాజా శతకంతో ఇబ్రహీం జద్రాన్ అఫ్గానిస్థాన్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో ఆరు శతకాలతో మహ్మద్ షెహజాద్ అగ్రస్థానంలో ఉన్నాడు. రహ్మానుల్లా గుర్బాజ్, రహమత్ షా, ఇబ్రహీం జద్రాన్ తలా ఓ ఐదు సెంచరీలతో సంయుక్తంగా రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
అఫ్గానిస్థాన్ తరఫున అత్యధిక వన్డే సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
6 – మహ్మద్ షెహజాద్
5 – రహ్మానుల్లా గుర్బాజ్
5 – రహమత్ షా
5 – ఇబ్రహీం జద్రాన్
ODI World Cup 2023 : పాకిస్థాన్‌కు వర్షం సాయం చేస్తే.. ఐసీసీ షాకిచ్చింది
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో ఇబ్రహీం జద్రాన్ (129; 143 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకం బాదాడు. రషీద్ ఖాన్ (35 నాటౌట్; 18 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రహమత్ షా (30), హష్మతుల్లా షాహిదీ (26), అజ్మతుల్లా ఒమర్జాయ్ (22) లు రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ రెండు వికెట్లు తీశాడు. మిచెల్ స్టార్క్, గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపా లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
HUNDRED! ??@IZadran18 creates HISTORY in Mumbai as he becomes the 1st-ever Afghan batter to bring up a Century in the World Cup. Incredible stuff this is from the youngster! ??
This is also his 5th ODI Hundred! ?️#AfghanAtalan | #CWC23 | #AFGvAUS | #WarzaMaidanGata pic.twitter.com/hkKnM0CXgf
— Afghanistan Cricket Board (@ACBofficials) November 7, 2023