ICC Champions Trophy 2025 : పాకిస్తాన్ కు బిగ్ షాక్.. ముగిసిన కథ..!

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది.

ICC Champions Trophy 2025 (Photo Credit : Google)

ICC Champions Trophy 2025 : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కు బిగ్ షాక్ తగిలింది. ఈ టోర్నీలో పాక్ కథ ముగిసింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో కివీస్ జట్టు సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక గ్రూప్ ఏ నుంచి భారత జట్టు సైతం సెమీస్ లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓటమిపాలైంది. ఈ నెల 27న బంగ్లాదేశ్ తో పాక్ తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ లో గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండదు.

భారత్, కివీస్ జట్లు చెరో రెండు విజయాలు నమోదు చేశాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీస్ బెర్తులు కన్ ఫర్మ్ చేసుకున్నాయి. కాగా, మెరుగైన రన్ రేట్ కారణంగా కివీస్ (+0.863) పాయింట్ల పట్టికలో టాప్ లో ఉంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ కివీస్, బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. బంగ్లాను న్యూజిలాండ్ చిత్తు చేసింది. తద్వారా సెమీస్ బెర్త్ కన్ ఫర్మ్ చేసుకుంది. అంతేకాదు భారత్ కు సెమీస్ బెర్త్ కన్ ఫర్మ్ చేసింది.

Also Read : విరాట్‌ కోహ్లీ సెంచరీ చేయడానికి ఇలా సాయం చేశాను: అక్షర్ పటేల్

తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. 237 రన్స్ టార్గెట్ ను న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి చేధించింది. రచిన్ రవీంద్ర సెంచరీతో చెలరేగాడు. 105 బంతుల్లో 112 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. ఒక దశలో 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును రచిన్ ఆదుకున్నాడు. సెంచరీతో కదంతొక్కాడు. జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ గెలుపుతో కివీస్, భారత్ సెమీస్ చేరగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.

కాగా, పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిరకాల ప్రత్యర్థిని మరోసారి భారత్ చిత్తు చిత్తుగా ఓడించింది. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిపోయాడు.