Team India: టాప్ గేర్ లో టీమిండియా.. రికార్డులే రికార్డులు!

వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా రికార్డుల వేట కొనసాగుతోంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తో రోహిత్ సేన భారీ విజయం అందుకోవడంతో పాటు పలు రికార్డులు సాధించింది.

Team India ODI world cup 2023 records

Team India Records in ODI World cup 2023: ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా వరుస విజయాలతో దూసుకెళుతోంది. ఇప్పటివరకు ఓటమనేదే లేకుండా అప్రతిహతంగా విజయాల పరంపర కొనసాగిస్తోంది. వరుసగా ఏడు విజయాలతో పాయింట్ల పట్టికలో టాపర్ గా నిలిచింది. తాజాగా శ్రీలంకను చిత్తుగా ఓడించి మరోసారి సత్తా చాటింది. ఈ క్రమంలో టీమిండియాతో పాటు ప్లేయర్స్ పలు రికార్డులు సాధించారు.

టీమిండియా రెండోసారి
వన్డే ప్రపంచకప్ లో టీమిండియా వరుసగా ఏడు విజయాలు సాధించడం ఇది రెండోసారి. 2003 మెగా టోర్నిలో వరుసగా 8 విజయాలు నమోదు చేసింది. కాగా, జోరు మీదున్న రోహిత్ సేన ఈ రికార్డును మరింత మెరుగుపరుచుకుంటుందో, లేదో చూడాలి.

Virat Kohli records

కింగ్ కోహ్లి రికార్డుల సిరీస్
హాఫ్ సెంచరీ(88)తో రాణించిన స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లి తన రికార్డులను మరింత మెరుగు పరుచుకున్నాడు. వన్డే ప్రపంచకప్ లో ఎక్కువసార్లు 50 ప్లస్ స్కోరు చేసిన రెండో ప్లేయర్ గా కోహ్లి నిలిచాడు. ఇప్పటివరకు 13 సార్లు ఈ ఫీట్ సాధించాడు. సచిన్ టెండూల్కర్ (21) మాత్రమే అతడికంటే ముందున్నాడు. రోహిత్ శర్మ(12), షకీబ్ అల్ హసన్ (12) సంగక్కర(12) తర్వాత స్థానాల్లో ఉన్నారు. ఇక ఓవరాల్ గా వన్డేల్లో 118వ సారి కోహ్లి 50 ప్లస్ స్కోరు చేశాడు. సచిన్(145 సార్లు) ముందున్నాడు. ఇక ఒక క్యాలెండర్ ఇయర్ లో అత్యధికసార్లు వెయ్యి పరుగులు చేసిన తొలి ప్లేయర్ విరాట్ కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు 8 సార్లు అతడీ ఫీట్ సాధించాడు. సచిన్ టెండూల్కర్(7) రికార్డును బ్రేక్ చేశాడు.

Mohammed Shami

షమీ సూపర్
మహ్మద్ షమీ ఇప్పటివరకు ప్రపంచకప్ లో 3 సార్లు 5 వికెట్ల ప్రదర్శన చేసి ఆస్ట్రేలియా బౌలర్ మిచెల్ స్టార్క్ సరసన చేరాడు. అంతేకాదు మెగాటోర్నిలో అత్యధిక వికెట్లు (45) తీసిన భారత బౌలర్ గానూ రికార్డ్ క్రియేట్ చేశాడు. జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్(44)ను అధిగమించి ఈ ఘనత సాధించాడు. మహ్మద్ షమీ కేవలం 14 ఇన్నింగ్స్ లోనే 45 వికెట్లు పడగొట్టాడు. జహీర్ ఖాన్ 23, శ్రీనాథ్ 33 ఇన్నింగ్స్ లో ఈ ఫీట్ నమోదు చేశారు.

Also Read: నా సక్సెస్ సీక్రెట్ ఇదే.. అవి చాలా ముఖ్యం మహ్మద్ షమీ

Team India ODI worldcup records

బుమ్రా భళా.. అయ్యారే అయ్యర్!
వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్ కే వికెట్ పడగొట్టిన మొదటి భారత్ బౌలర్ గా జస్ప్రీత్ బుమ్రా రికార్డు కెక్కాడు. శ్రేయస్ అయ్యర్ ఎక్కువ దూరం సిక్స్ కొట్టి సరికొత్త రికార్డ్ సాధించాడు. అతడు బాదిన సిక్సర్ 106 మీటర్ల అవతలపడింది. గ్లెన్ మాక్స్‌వెల్ (104 మీటర్లు) సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. కాగా, మెగా టోర్నమెంట్ ముగిసేలోగా టీమిండియా ప్లేయర్లు ఇంకా ఎన్ని రికార్డులు సాధిస్తారో చూడాలి.

Also Read: బెస్ట్ ఫీల్డ‌ర్ అవార్డుల్లో స‌ర్‌ప్రైజ్‌.. అనౌన్స్ చేసిన క్రికెట్ దిగ్గ‌జం.. ఎవ‌రికో తెలుసా..?

ట్రెండింగ్ వార్తలు