AFG vs SL: శ్రీలంక పై ఏడు వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ విజ‌యం

అఫ్గానిస్థాన్ మ‌రో విజ‌యం సాధించింది. పూణే వేదిక‌గా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచులో ఏడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

AFG vs SL

అఫ్గానిస్థాన్ విజ‌యం
242 ప‌రుగుల ల‌క్ష్యాన్ని అఫ్గానిస్థాన్ 45.2 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (73 నాటౌట్), ర‌హ్మ‌త్ షా (62), హష్మతుల్లా షాహిదీ (58 నాటౌట్ ) లు హాఫ్ సెంచ‌రీలు చేశారు.

హష్మతుల్లా, అజ్మతుల్లా హాఫ్ సెంచ‌రీలు..
హష్మతుల్లా షాహిదీ, అజ్మతుల్లా ఒమర్జాయ్ లు హాఫ్ సెంచ‌రీలు చేశాడు. హష్మతుల్లా 67 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌తో, అజ్మతుల్లా ఒమర్జాయ్ 50 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నారు.

రహ్మత్ షా హాఫ్ సెంచరీ
అఫ్గానిస్థాన్ బ్యాటర్ రహ్మత్ షా హాఫ్ సెంచరీ చేశాడు. 61 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. వన్డేల్లో అతడికిది 25వ హాఫ్ సెంచరీ. 25 ఓవర్లలో 118/2 స్కోరుతో అఫ్గానిస్థాన్ ఆట కొనసాగిస్తోంది. 25 ఓవర్లలో 119/2 స్కోరుతో అఫ్గానిస్థాన్ ఆట కొనసాగిస్తోంది.

రెండో వికెట్ కోల్పోయిన అఫ్గానిస్థాన్
73 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ రెండో వికెట్ నష్టపోయింది. ఇబ్రహీం జద్రాన్ 39 పరుగులు చేసి అవుటయ్యాడు.

ఫస్ట్ ఓవర్ లోనే అఫ్గానిస్థాన్ కు షాక్
242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్ కు ఫస్ట్ ఓవర్ లోనే షాక్ తగిలింది. రహ్మానుల్లా గుర్బాజ్ డకౌటయ్యాడు. 8 ఓవర్లలో 40/1 స్కోరుతో అఫ్గానిస్థాన్ ఆట
కొనసాగిస్తోంది.

శ్రీలంక ఆలౌట్.. అఫ్గానిస్థాన్ టార్గెట్ ఎంతంటే?
అఫ్గానిస్థాన్ కు శ్రీలంక 242 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. నిస్సాంక 46, కుశాల్ మెండిస్ 39, సమరవిక్రమ 36, మహేశ్ తీక్షణ 29, ఏంజెలో మాథ్యూస్ 23, అసలంక 22, కరుణరత్నే 15, పరుగులు చేశారు. అఫ్గానిస్థాన్ బౌలర్లో ఫజల్హా 4, ముజీబ్ 2 వికెట్లు పడగొట్టారు.
రషీద్ ఖాన్, అజ్మతుల్లా చెరో వికెట్ తీశారు.

 

8వ వికెట్ కోల్పోయిన శ్రీలంక
230 పరుగుల వద్ద శ్రీలంక 8వ వికెట్ కోల్పోయింది. మహేశ్ తీక్షణ 29 పరుగులు చేసి అవుటయ్యారు.

ఏడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక
శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతోంది. 185 పరుగుల వద్ద ఏడో వికెట్ చేజార్చుకుంది. దుష్మంత చమీర(1) రనౌటయ్యాడు. చరిత్ అసలంక(22) ఆరో వికెట్ గా పెవిలియన్ చేరాడు. 42 ఓవర్లలో 193/7 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

ధనంజయ డిసిల్వా అవుట్
167 పరుగుల వద్ద శ్రీలంక ఐదో వికెట్ నష్టపోయింది. ధనంజయ డిసిల్వా 14 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. శ్రీలంక 38 ఓవర్లలో 180/5 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది.

సమరవిక్రమ అవుట్
29.1 ఓవర్లలో 139 పరుగుల వద్ద శ్రీలంక నాలుగో వికెట్ నష్టపోయింది. సదీర సమరవిక్రమ 36 పరుగులు చేసి అవుటయ్యాడు.

మూడో వికెట్ కోల్పోయిన శ్రీలంక
133 పరుగుల వద్ద శ్రీలంక మూడో వికెట్ కోల్పోయింది. కుశాల్ మెండిస్ 39 పరుగులు చేసి అవుటయ్యాడు.

25 ఓవర్లలో శ్రీలంక 125/2
శ్రీలంక నిలకడగా ఆడుతోంది. 25 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కుశాల్ మెండిస్ 35, సదీర సమరవిక్రమ 28 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. కరుణరత్నే 15, నిస్సాంక 46 పరుగులు చేసి అవుటయ్యారు.

నిస్సాంక అవుట్.. రెండో వికెట్ డౌన్
84 పరుగుల వద్ద శ్రీలంక రెండో వికెట్ కోల్పోయింది. పాతుమ్ నిస్సాంక 46 పరుగులు చేసి అవుటయ్యాడు.

తొలి వికెట్ కోల్పోయిన శ్రీలంక
22 పరుగుల వద్ద శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. కరుణరత్నే15 పరుగులు చేసి అవుటయ్యాడు. 15 ఓవర్లలో శ్రీలంక 66/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. పాతుమ్ నిస్సాంక 38, కుశాల్ మెండిస్ 12 పరుగులతో ఆడుతున్నారు.

5 ఓవర్లలో శ్రీలంక 18/0
టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక నెమ్మదిగా ఆడుతోంది. మొదటి 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 18 పరుగులు చేసింది.

ఫీల్డింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ 
అఫ్గానిస్థాన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్ అప్పగించాడు. ఈరోజు నూర్‌కి విశ్రాంతి ఇచ్చి.. అతడి స్థానంలో ఫజల్‌హాక్ ను తుదిజట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు. శ్రీలంక టీమ్ లో పెరీరా ప్లేస్ లో కరుణరత్నే వచ్చాడు.

 

తుది జట్లు
అఫ్గానిస్థాన్: రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్(వికెట్ కీపర్), మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హా

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(కెప్టెన్/వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, ఏంజెలో మాథ్యూస్, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

ఇరు జట్లకు కీలక మ్యాచ్
ODI World Cup 2023 AFG vs SL: వన్డే ప్రపంచకప్ 30వ మ్యాచ్ లో శ్రీలంక, అఫ్గానిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం. ఇప్పటివరకు ఐదేసి మ్యాచ్ లు ఆడిన రెండేసి విజయాలు సాధించి 4 పాయింట్లు దక్కించుకున్నాయి. అయితే శ్రీలంక మెరుగైన రన్ రేటుతో 5వ స్థానంలో ఉంది. అఫ్గానిస్తాన్ ఏడో స్థానంలో కొనసాగుతుంది.

 

గత మ్యాచ్ లో ఇంగ్లండ్ ను ఓడించి శ్రీలంక జోష్ లో ఉంది. మొదటి మూడు మ్యాచ్ ల్లో ఓడినా గత రెండు మ్యాచ్ ల్లో శ్రీలంక పుంజుకుంది. అఫ్గానిస్థాన్ పై విజయం సాధిస్తే సెమీస్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. అఫ్గానిస్థాన్ జట్టును కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఎందుకంటే పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లను ఓడించి సంచలన విజయాలు సాధించింది. తనదైన రోజున అఫ్గానిస్థాన్ అద్భుతాలు చేయగలదు. కాబట్టి రెండు జట్లకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయని చెప్పొచ్చు.

రషీద్ ఖాన్ 100 వన్డే
అఫ్గానిస్థాన్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ ఈరోజు 100వ ODI ఆడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి అఫ్గానిస్థాన్ కోచ్ జోనాథన్ ట్రాట్ స్సెషల్ మొమెంటో ప్రెజెంట్ చేశారు. జట్టు సహచర సభ్యులు అతడికి అభినందనలు తెలిపారు.