BAN vs SL: బంగ్లాదేశ్ విజ‌యం..

శ్రీలంక పై బంగ్లాదేశ్ గెలుపొందింది

icc cricket world cup 2023 today bangladesh vs sri lanka live match score and updates

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో బంగ్లాదేశ్ రెండో విజ‌యాన్ని న‌మోదు చేసింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 06 Nov 2023 10:00 PM (IST)

    బంగ్లాదేశ్ గెలుపు

    ల‌క్ష్యాన్ని బంగ్లాదేశ్ ల‌క్ష్యాన్ని 41.1 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

  • 06 Nov 2023 09:38 PM (IST)

    ముష్ఫికర్ ఔట్..

    మధుశంక బౌలింగ్‌లో ముష్ఫికర్ (10) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 37.4వ ఓవ‌ర్‌లో 249 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది.

  • 06 Nov 2023 09:22 PM (IST)

    35 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 225/4

    శ‌త‌కాల‌కు చేరువ‌గా వ‌చ్చిన నజ్ముల్ హుస్సేన్ శాంటో (90), షకీబ్ అల్ హసన్ (82) లు ఔట్ అయ్యారు. 35 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 225/4. మహ్మదుల్లా (8), ముష్ఫికర్ రహీమ్ (4) లు ఆడుతున్నారు.

  • 06 Nov 2023 08:39 PM (IST)

    27 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 173/2

    నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్ అర్ధ‌శ‌త‌కాలు పూర్తి చేసుకున్నారు. 27 ఓవ‌ర్ల‌కు బంగ్లాదేశ్ స్కోరు 173/2. నజ్ముల్ హుస్సేన్ శాంటో (79), షకీబ్ అల్ హసన్ (55) లు ఆడుతున్నారు.

  • 06 Nov 2023 07:04 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

    41 పరుగుల వద్ద బంగ్లాదేశ్ రెండో వికెట్ కోల్పోయింది. నజ్ముల్ హుస్సేన్ శాంటో 7 పరుగులు చేసి దిల్షన్ మధుశంక బౌలింగ్ లో అవుటయ్యాడు. 16 ఓవర్లలో 90/2 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

  • 06 Nov 2023 06:36 PM (IST)

    తొలి వికెట్ కోల్పోయిన బంగ్లాదేశ్

    280 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ తాంజిద్ హసన్ 9 పరుగులు చేసి దిల్షన్ మధుశంక బౌలింగ్ లో అవుటయ్యాడు. 3 ఓవర్లలో 23/1 స్కోరుతో బంగ్లాదేశ్ ఆట కొనసాగిస్తోంది.

  • 06 Nov 2023 05:51 PM (IST)

    అసలంక సెంచరీ.. బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?

    బంగ్లాదేశ్ కు శ్రీలంక 280 పరుగుల టార్గెట్ పెట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.3 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటయింది. చరిత్ అసలంక సెంచరీ చేయడంతో శ్రీలంక మంచి స్కోరు సాధించింది. 105 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. పాతుమ్ నిస్సాంక 41, సదీర సమరవిక్రమ 41, ధనంజయ డిసిల్వా 34, మహేశ్ తీక్షణ 22, కుశాల్ మెండిస్ 19 పరుగులు చేశారు.

     

  • 06 Nov 2023 04:48 PM (IST)

    చరిత్ అసలంక హాఫ్ సెంచరీ

    చరిత్ అసలంక హాఫ్ సెంచరీ చేశాడు. 56 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ధశతకం పూర్తి చేశాడు. 38 ఓవర్లలో 208/5 స్కోరుతో శ్రీలంక ఆట కొనసాగిస్తోంది.

  • 06 Nov 2023 04:02 PM (IST)

    5 వికెట్లు కోల్పోయిన శ్రీలంక

    24.2 ఓవర్ లో 135 వద్ద శ్రీలంక 5వ వికెట్ కోల్పోయింది. ఏంజెలో మాథ్యూస్(0) టైమ్డ్ అవుటయ్యాడు.

  • 06 Nov 2023 03:18 PM (IST)

    మూడు వికెట్లు కోల్పోయిన శ్రీలంక

    టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. పాతుమ్ నిస్సాంక 41, కుశాల్ పెరీరా 4, కుశాల్ మెండిస్ 19 పరుగులు చేసి అవుటయ్యారు.

  • 06 Nov 2023 01:49 PM (IST)

    శ్రీలంక సెమీస్ చాన్స్ ఇలా..

    ఇప్పటివరకు ఏడు మ్యాచ్ లు ఆడిన శ్రీలంక 2 మ్యాచ్ లు గెలిచి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. మిగతా రెండు మ్యాచుల్లోనూ మంచి రన్ రేటుతో గెలవాలి. న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తాము ఆడబోయే మిగతా మ్యాచుల్లో ఓడిపోవాలి. అప్పుడు ఈ నాలుగు జట్లు 8 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఎక్కువ నెట్ రన్ రేట్‌తో ఉన్న జట్టు సెమీస్ కు అర్హత పొందుతుంది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్ ఇప్పటికే సెమీస్ రేసు నుంచి అవుటయ్యాయి.

  • 06 Nov 2023 01:38 PM (IST)

    టాస్ గెలిచిన బంగ్లాదేశ్

    శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో శ్రీలంక ముందుగా బ్యాటింగ్ చేయనుంది. బంగ్లాదేశ్ టీమ్ ఒక మార్పు జరిగింది. ముస్తాఫిజుర్ స్థానంలో తాంజిమ్ సాకిబ్ జట్టులోకి వచ్చాడు. శ్రీలంక రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. కరుణరత్నే, హేమంత ప్లేస్ లో కుశాల్ పెరీరా, ధనంజయ టీమ్ లోకి వచ్చారు.

     

    తుది జట్లు
    శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్(కెప్టెన్/వికెట్ కీపర్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ డి సిల్వా, మహేశ్ తీక్షణ, దుష్మంత చమీర, కసున్ రజిత, దిల్షన్ మధుశంక

    బంగ్లాదేశ్: తాంజిద్ హసన్, లిట్టన్ దాస్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, ముష్ఫికర్ రహీమ్(వికెట్ కీపర్), మహ్మదుల్లా, షకీబ్ అల్ హసన్(కెప్టెన్), తౌహిద్ హృదయ్, మెహిదీ హసన్ మిరాజ్, తంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షోరీఫుల్ ఇస్లాం