India vs Sri Lanka
India vs Sri Lanka 2023 : వాంఖడే వేదికగా టీమ్ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక చిత్తు చిత్తుగా ఓడిపోయింది.
358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
షమి బౌలింగ్‌లో కసున్ రజిత (14) శుభ్‌మన్ గిల్ చేతికి చిక్కాడు. దీంతో 49 పరుగుల వద్ద శ్రీలంక తొమ్మిదో వికెట్ కోల్పోయింది.
మహ్మద్ షమీ బౌలింగ్‌లో మాథ్యూస్ (12) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో దీంతో 13.1వ ఓవర్‌లో 29 పరుగుల వద్ద శ్రీలంక ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
మహ్మద్ షమీ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో చమీర (0) ఔట్ అయ్యాడు. దీంతో 11.3వ ఓవర్‌లో 22 పరుగుల వద్ద శ్రీలంక ఏడో వికెట్ కోల్పోయింది.
శ్రీలంక జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. 14 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లకు శ్రీలంక స్కోరు 14/6. చమీర (0), ఏంజెలో మాథ్యూస్ (7) లు ఆడుతున్నారు.
భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన శ్రీలంక తడబడుతోంది. మూడు పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ మూడు వికెట్లు తీయగా, బుమ్రా ఓ వికెట్ పడగొట్టాడు. 4 ఓవర్లకు శ్రీలంక స్కోరు 7/4. చరిత్ అసలంక (0), ఏంజెలో మాథ్యూస్ (4) లు ఆడుతున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (92; 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (88 ;94 బంతుల్లో 11 ఫోర్లు) లు తృటిలో శతకాలు చేజార్చుకున్నారు. శ్రేయస్ అయ్యర్ (82; 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్ శర్మ (4) విఫలం కాగా.. కేఎల్ రాహుల్ (21), రవీంద్ర జడేజా (35) లు రాణించారు. శ్రీలంక బౌలర్లలో మధుశంక ఐదు వికెట్లు తీశాడు. చమీర ఓ వికెట్ పడగొట్టాడు.
మధుశంక బౌలింగ్‌లో మహేశ్ తీక్షణ క్యాచ్ అందుకోవడంతో శ్రేయస్ అయ్యర్ (82; 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 47.3వ ఓవర్‌లో 333 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
మహేశ్ తీక్షణ బౌలింగ్‌లో ఫోర్ కొట్టి మిడిల్ ఆర్డర్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ 36 బంతుల్లో 2 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
భారత్ మరో వికెట్ కోల్పోయింది. మధుశంక బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ (12) కుశాల్ మెండీస్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో భారత్ 41.3వ ఓవర్‌లో 276 పరుగల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది.
చమీర బౌలింగ్‌లో హేమంత క్యాచ్ అందుకోవడంతో కేఎల్ రాహుల్ (21; 19 బంతుల్లో 2 ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 39.2 ఓవర్‌లో 256 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.
భారత్ మరో వికెట్ కోల్పోయింది. మధుశంక బౌలింగ్‌లో పాతుమ్ నిస్సాంక క్యాచ్ అందుకోవడంతో విరాట్ కోహ్లీ (88; 94 బంతుల్లో 11 ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 31.3వ ఓవర్‌లో 196 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది.
8⃣8⃣ runs
9⃣4⃣ deliveries
1⃣1⃣ foursWell played, Virat Kohli! ??#TeamIndia 196/3 #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/gcEO1QhVgv
— BCCI (@BCCI) November 2, 2023
భారత్ మరో వికెట్ కోల్పోయింది. మధుశంక బౌలింగ్‌లో కుశాల్ మెండీస్ క్యాచ్ అందుకోవడంతో 193 పరుగుల వద్ద గిల్ (92; 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లు) రెండో వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు.
A superb 92-run knock by Shubman Gill comes to an end!
A fine innings that from the #TeamIndia opener ??
India 193/2 after 30 overs. #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/tfotB5X7Fa
— BCCI (@BCCI) November 2, 2023
హేమంత బౌలింగ్‌లో(18.3వ ఓవర్) ఫోర్ కొట్టి 55 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 20 ఓవర్లకు భారత స్కోరు 120/1. గిల్ (53), కోహ్లీ (54) లు ఆడుతున్నారు.
Second FIFTY of #CWC23 for Shubman Gill!
His 11th half-century in ODIs ??
Follow the match ▶️ https://t.co/rKxnidWn0v#TeamIndia | #MenInBlue | #INDvSL pic.twitter.com/LfCnsQhyUl
— BCCI (@BCCI) November 2, 2023
దుషన్ హేమంత బౌలింగ్‌లో(16.1వ ఓవర్) రెండు పరుగులు తీసి 50 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 17 ఓవర్లకు భారత స్కోరు 106/1. గిల్ (41), కోహ్లీ (52) లు ఆడుతున్నారు.
Half-century for Virat Kohli ??
He brings up his 7⃣0⃣th ODI Fifty ?
Follow the match ▶️ https://t.co/rKxnidWn0v#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/FBDICufdFg
— BCCI (@BCCI) November 2, 2023
కోహ్లీ , గిల్ లు ఆచితూచి ఆడుతున్నారు. 5 ఓవర్లకు టీమ్ఇండియా స్కోరు 25/1. విరాట్ కోహ్లీ (10), గిల్ (9) ఆడుతున్నారు.
మొదటి ఓవర్‌లోనే టీమ్ ఇండియాకు షాక్ తగిలింది. మధుశంక బౌలింగ్‌లో మొదటి బంతికి ఫోర్ కొట్టిన రోహిత్ శర్మ రెండో బంతికి ఔట్ అయ్యాడు. 1 ఓవర్‌కు టీమ్ ఇండియా స్కోరు 8/1. విరాట్ కోహ్లీ (4), గిల్ (0) ఆడుతున్నారు.
పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుశాల్ మెండిస్(కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక
రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్
టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ మొదట బ్యాటింగ్ చేయనుంది. భారత జట్టులో ఎటువంటి మార్పులు లేవు.
? Toss and Team Update ?
Sri Lanka win the toss and elect to bowl first.
A look at #TeamIndia's Playing XI ??
Follow the match ▶️ https://t.co/rKxnidWn0v#CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/aI5l9xm4p4
— BCCI (@BCCI) November 2, 2023
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ టోర్నీలో టీమ్ఇండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఆరు మ్యాచుల్లోనూ గెలిచి ఓటమే ఎగురని జట్టుగా నిలిచింది. మెగాటోర్నీలో భాగంగా ముంబైలోని వాంఖడే వేదికగా శ్రీలంకతో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లాలని టీమ్ఇండియా భావిస్తోంది. ఎలాగైనా గెలిచి సెమీస్ రేసులో నిలవాలని శ్రీలంక ఆరాటపడుతోంది.
Hello from the Wankhede Stadium, Mumbai! ?️
Ready for another cracking contest ?
? Sri Lanka
⏰ 2 PM IST
?️ https://t.co/Z3MPyeL1t7#TeamIndia | #CWC23 | #MenInBlue | #INDvSL pic.twitter.com/OhVFMamKFg— BCCI (@BCCI) November 2, 2023