ICC Hall Of Fame 2024 AB De Villiers Alastair Cook Neetu David Inducted
ICC Hall of Fame 2024 : ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో భారత మాజీ మహిళా క్రికెటర్ నీతూ డేవిడ్‌కు చోటు దక్కింది. ఆమెతో పాటు దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు అలిస్టర్‌కుక్‌లను హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చేర్చుతున్నట్లు బుధవారం ఐసీసీ వెల్లడించింది. గతేడాది టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్, డయానా ఎడుల్జీ, శ్రీలంక దిగ్గజ ఆటగాడు అరవింద డిసిల్వాలు హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
1995 నుంచి 2008 మధ్య కాలంలో నీతూ డేవిడ్ టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించింది. ఎడమ చేతివాటం స్పిన్నర్ 97 వన్డేలు, 10 టెస్టులు ఆడింది. వన్డేల్లో 141 వికెట్లు, టెస్టుల్లో 41 వికెట్లు సాధించింది. భారత జట్టు తరుపున వన్డేల్లో 100 వికెట్లు తీసిన తొలి భారత మహిళా క్రికెట్‌ర్‌గా రికార్డులకు ఎక్కింది. ఆమె ప్రస్తుతం మహిళల క్రికెట్ జట్టు సెలక్షన్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.
IND vs NZ : న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రోహిత్ శర్మను ఊరిస్తున్న భారీ రికార్డు..
డివిలియర్స్ కెరీర్‌లో దక్షిణాఫ్రికా తరుపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 8765 పరుగులు, వన్డేల్లో 9,577 పరుగులు టీ20ల్లో 1672 పరుగులు సాధించాడు. ఇక వికెట్ కీపర్‌గా మూడు ఫార్మాట్లలో 463 ఔట్లలో పాలు పంచుకున్నాడు. 17 స్టంపింగ్స్ చేశాడు.
అలిస్టర్ కుక్ 2006 నుండి 2018 ఇంగ్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. అతడు 161 టెస్టులు, 92 వన్డేలు, 4 టీ20 మ్యాచులు ఆడాడు. టెస్టుల్లో 12,472, వన్డేల్లో 3,204, టీ20ల్లో 61 పరుగులు చేశాడు.
Three legends of the game unveiled as the newest ICC Hall of Fame inductees 🏅🏅🏅
More ⬇https://t.co/0JjbprOoYP
— ICC (@ICC) October 16, 2024