టాప్ ప్లేస్ కోల్పోయిన శుభమన్ గిల్.. వరుస ర్యాంకుల్లో కోహ్లి, రోహిత్

ICC Men's ODI Player Batting Rankings: ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా స్టార్ బ్యాటర్ల వరుస ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. యువ ఓపెనర్ శుభమన్ గిల్ నంబర్‌వ‌న్ స్థానాన్ని కోల్పోయాడు.

ICC ODI Rankings Shubman Gill as No 2 ODI batter

ICC ODI Batting Rankings : ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా యువ బ్యాటర్ శుభమన్ గిల్ టాప్ ప్లేస్ కోల్పోయాడు. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం తిరిగి నంబర్‌వ‌న్ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకుల ప్రకారం గిల్ సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వరుసగా 3, 4 ర్యాంకుల్లో ఉన్నారు. డేవిడ్ వార్నర్ (5), డారిల్ మిచెల్(6), తర్వాతి స్థానాల్లో నిలిచారు. బౌలర్ల విభాగంలో సౌతాఫ్రికా బౌలర్ కేశవ్ మహరాజ్ నంబర్‌వ‌న్ ర్యాంకులో కొనసాగుతున్నాడు. హజిల్‌వుడ్(2), మహ్మద్ షమి(3), ఆడమ్ జంపా(4), బుమ్రా(5) టాప్ 5లో ఉన్నారు. బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ నంబర్‌వ‌న్ ఆల్‌రౌండ‌ర్‌గా కొనసాగుతున్నాడు.

సూర్యకుమార్ యాదవ్ హవా
టీ20 ర్యాంకుల్లో సూర్యకుమార్ యాదవ్ నంబర్‌వ‌న్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. 887 రేటింగ్ పాయింట్లు సూర్య ఖాతాలో ఉన్నాయి. మహ్మద్ రిజ్వాన్(2), ఆడెన్ మార్‌క్ర‌మ్‌(3), బాబర్ ఆజం(4), రిలీ రోసోవ్(5) తర్వాతి ర్యాంకుల్లో ఉన్నారు. బౌలర్లలో ఆదిల్ రషీద్ 1, రషీద్ ఖాన్ 2, రవి బిష్ణోయ్ 3, వనిందు హసరంగ 4, మహేశ్ తీక్షణ 5 ర్యాంకుల్లో నిలిచారు. టీ20 ర్యాంకుల్లోనూ షకీబ్ అల్ హసన్ టాప్ ఆల్‌రౌండ‌ర్‌గా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 4వ ర్యాంకులో కంటిన్యు అవుతున్నాడు.

10వ ర్యాంక్‌లో రోహిత్ శర్మ 
864 రేటింగ్ పాయింట్లతో టెస్టులో నంబర్‌వ‌న్ బ్యాటర్‌గా న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియమ్సన్ తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 10వ ర్యాంక్ లో నిలిచాడు. జో రూట్ 2, స్టీవ్ స్మిత్ 3, ఉస్మాన్ ఖవాజా 4, బాబర్ ఆజం 5 ర్యాంకుల్లో ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ టాప్ బౌలర్‌గా, రవీంద్ర జడేజా నంబర్‌వ‌న్ ఆల్‌రౌండ‌ర్‌గా కొనసాగుతున్నారు. కాగా, మూడు ఫార్మాట్లలోనూ బాబర్ ఆజం టాప్ 5లో ఉండడం విశేషం.

Also Read: ఐపీఎల్ వేలంలో భారీ ధర లభించడంపై మిచెల్ స్టార్క్ ఏమన్నాడో తెలుసా?