IND vs SA : కుల్దీప్ యాద‌వ్ పై రిష‌భ్ పంత్ ఆగ్ర‌హం.. ‘ఇలా చేయ‌కు.. నేను నీకు మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్పను..’

గౌహ‌తి వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs SA ) ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

IND vs SA : కుల్దీప్ యాద‌వ్ పై రిష‌భ్ పంత్ ఆగ్ర‌హం.. ‘ఇలా చేయ‌కు.. నేను నీకు మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్పను..’

IND vs SA 2nd Test Rishabh Pant Scolds Kuldeep Yadav

Updated On : November 26, 2025 / 11:11 AM IST

IND vs SA : భార‌త స్టార్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ పై టీమ్ఇండియా కెప్టెన్ రిష‌బ్ పంత్ మండిప‌డ్డాడు. ‘నేను నీకు మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్ప‌ను. త్వ‌ర‌గా బాల్ వేయి.’ అంటూ పంత్ త‌న అస‌హ‌నాన్ని ప్ర‌ద‌ర్శించాడు. గౌహ‌తి వేదిక‌గా ద‌క్షిణాఫ్రికాతో జ‌రుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. పంత్ మాట్లాడిన మాట‌లు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

అస‌లేం జ‌రిగిందంటే..?

మ్యాచ్ నాలుగో రోజు ఆట‌లో ద‌క్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 48వ ఓవ‌ర్‌లో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. కుల్దీప్ ఈ ఓవ‌ర్‌లోని మొద‌టి బంతి వేసే ముందు ఫీల్డింగ్ సెట్ చేస్తూ ఉన్నాడు. ఇందుకు చాలా స‌మ‌యం తీసుకున్నాడు. దీంతో పంత్ అస‌హ‌నానికి గురైయ్యాడు. ‘ఇలా చేయ‌కు.. ముందు బాల్ వేయి. మ‌ళ్లీ మ‌ళ్లీ నేను నీకు ఇలా చెప్ప‌ను.’ అని అన్నాడు.

IND vs SA : సురేశ్ రైనా కీల‌క వ్యాఖ్య‌లు.. టెస్టుల్లో టీమ్ఇండియా ఓట‌ముల‌పై.. గంభీర్ త‌ప్పేం లేదు.. కోచ్ క‌న్నా కూడా..

ఐసీసీ నిబంధ‌న‌ల ప్ర‌కారం.. ఒక‌ ఓవర్ ముగిసిన త‌రువాత మ‌రుస‌టి ఓవ‌ర్‌ను 60 సెకన్లలోపు ప్రారంభించాలి. ఈ స‌మ‌యం మించితే ఫీల్డింగ్ జ‌ట్టుకు రెండు సార్లు అంపైర్ వార్నింగ్ ఇస్తాడు. మూడోసారి కూడా అదే త‌ప్పు పున‌రావృతం అయితే.. అప్పుడు ఎలాంటి వార్నింగ్ ఇవ్వ‌కుండా 5 ప‌రుగులు పెనాల్టీగా విధిస్తాడు.

Smriti Mandhana : ఆస్ప‌త్రి నుంచి స్మృతి మంధాన తండ్రి డిశ్చార్జ్‌.. పెళ్లి ఎప్పుడంటే..?

కాగా.. కుల్దీప్ తన బంతులను వేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడం పట్ల పంత్ అసంతృప్తి చెందడం ఇదే తొలిసారి కాదు. ఈ మ్యాచ్ తొలిరోజు కూడా ఇలాగే జ‌రిగింది. ‘ఇది నీ ఇల్లు కాదు’.. త్వరగా బౌలింగ్ చేయాలని పంత్ అప్పుడు కుల్దీప్‌ను మంద‌లించాడు.