High Temperature : తెలంగాణ ప్రజలకు హైఅలర్ట్.. ఈ జిల్లాల ప్రజలు మరో నాలుగు రోజులు జాగ్రత్త.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
High Temperature : తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఫలితంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Heatwav
- తెలంగాణలో నిప్పుల వర్షం కురిపిస్తున్న భానుడు
- రికార్డు స్థాయిలో నమోదువుతున్న ఉష్ణోగ్రతలు
- ఇవాళ 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
- వచ్చే నాలుగు రోజులు ఇదే పరిస్థితి
High Temperature : తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. ఫలితంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా 46.5డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. వడదెబ్బ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 34మంది మరణించారు.. వచ్చే నాలుగు రోజులు తెలంగాణ వ్యాప్తంగా అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 18 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు తోడు.. వేడిగాలులు తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని అత్యవసర సూచనలు జారీ చేసింది.
తెలంగాణలో భానుడు ఉగ్రరూపం దాల్చాడు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో నిప్పుల వర్షం కురుస్తోంది. వరుసగా రెండోరోజు శుక్రవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండలకు తోడు వడగాల్పుల కారణంగా ప్రజలు మృత్యువాత పడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే వడదెబ్బ కారణంగా రాష్ట్రంలో 34మంది మృత్యువాత పడటం రాష్ట్రంలో ఎండల తీవ్రతకు అర్దం పడుతోంది. శనివారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
శుక్రవారం రాష్ట్రంలోనే అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (టి)లో 46.5 డిగ్రీల సెల్సియస్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం కూడా రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ముఖ్యంగా వచ్చే నాలుగు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో 18 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ సహా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఎండలు తీవ్రత ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ప్రజలు ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బయటకు రావొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అత్యవసరమై బయటకు వస్తే ఎండదెబ్బ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని, నిర్లక్ష్యం చేయొద్దని వైద్యులు సూచించారు.
