WTC Points Table : దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాభవం.. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో దిగజారిన స్థానం.. పాక్ తరువాతి స్థానంలో భారత్..
స్వదేశంలో భారత్‌కు (Team India) మరో ఘోర పరాభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా చేతిలో 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోయింది.
WTC Points Table update after South Africa series win India slip below Pakistan
WTC Points Table : స్వదేశంలో భారత్‌కు మరో ఘోర పరాభవం ఎదురైంది. దక్షిణాఫ్రికా చేతిలో 2-0 తేడాతో టెస్టు సిరీస్‌ను భారత్ కోల్పోయింది. గౌహతి వేదికగా భారత్ తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 408 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడంతో సౌతాఫ్రికా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025-27 పాయింట్ల పట్టికలో (WTC Points Table) తన రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
డబ్ల్యూటీసీ 2027 సైకిల్‌లో తాజా సిరీస్‌తో కలిపి దక్షిణాఫ్రికా ఇప్పటి వరకు నాలుగు టెస్టులు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. ప్రస్తుతం ఆ జట్టు ఖాతాలో 36 పాయింట్లు ఉండగా విజయశాతం 75గా ఉంది. ఇక దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోవడంతో భారత్ డబ్ల్యూటీసీలో ఐదో స్థానానికి పడిపోయింది.
IND vs SA : రెండో టెస్టులో చిత్తు చిత్తుగా ఓడిన భారత్.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా
ఇప్పటి వరకు భారత్ 9 టెస్టులు ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందగా మరో నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. టీమ్ఇండియా ఖాతాలో 52 పాయింట్లు ఉండగా 48.15 విజయశాతం కలిగి ఉంది.

ఇక ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందిన ఆస్ట్రేలియా 100 విజయశాతంతో అగ్రస్థానంలో ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓ మ్యాచ్ గెలిచి మరో మ్యాచ్ డ్రా చేసుకున్న శ్రీలంక 66.670 విజయశాతంతో మూడో స్థానంలో ఉంది. ఇక నాలుగో స్థానంలో పాక్ ఉంది. పాక్ రెండు మ్యాచ్‌లు ఆడగా ఓ మ్యాచ్‌లో గెలిచి మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. విజయ శాతం 50గా ఉంది.
ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, వెస్టిండీస్ జట్లు వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది స్థానాల్లో ఉన్నాయి. ఇక ఈ సైకిల్‌లో న్యూజిలాండ్ జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.
