IND vs SA : రెండో టెస్టులో చిత్తు చిత్తుగా ఓడిన భార‌త్‌.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ద‌క్షిణాఫ్రికా

గౌహ‌తి వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో (IND vs SA) ద‌క్షిణాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది.

IND vs SA : రెండో టెస్టులో చిత్తు చిత్తుగా ఓడిన భార‌త్‌.. సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ద‌క్షిణాఫ్రికా

IND vs SA 2nd Test South Africa won by 408 runs and win the series

Updated On : November 26, 2025 / 12:49 PM IST

IND vs SA : గౌహ‌తి వేదిక‌గా భార‌త్‌తో జ‌రిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా ఘ‌న విజ‌యం సాధించింది. 549 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన భార‌త్ 140 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

దీంతో సౌతాఫ్రికా 408 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ క్ర‌మంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0తో ద‌క్షిణాఫ్రికా క్లీన్ స్వీప్ చేసింది. కాగా.. భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఇన్ని ప‌రుగుల తేడాతో ఓడ‌డం ఇదే తొలిసారి కావ‌డం గ‌మ‌నార్హం.

IND vs SA : కుల్దీప్ యాద‌వ్ పై రిష‌భ్ పంత్ ఆగ్ర‌హం.. ‘ఇలా చేయ‌కు.. నేను నీకు మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్పను..’

మ్యాచ్‌ను (IND vs SA) డ్రా చేసుకోవాలంటే చివ‌రి రోజంతా క్రీజులో నిల‌వాల్సిన స్థితిలో ఓవ‌ర్ నైట్ స్కోరు 27/2 తో ఐదో రోజు రెండో ఇన్నింగ్స్‌ను భార‌త్ కొన‌సాగించింది. అయితే.. మ‌రో 113 ప‌రుగులు జోడించి మిగిలిన 8 వికెట్ల‌ను కోల్పోయింది.

టీమ్ఇండియా బ్యాట‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా (54; 87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) హాఫ్ సెంచ‌రీ చేశాడు. య‌శ‌స్వి జైస్వాల్ (13), సాయి సుద‌ర్శ‌న్ (14), వాషింగ్ట‌న్ (16) లు మిన‌హా మిగిలిన అంద‌రూ సింగిల్ డిజిట్‌కే ప‌రిమితం అయ్యారు. ద‌క్షిణాఫ్రికా బౌల‌ర్ల‌లో సైమన్ హార్మర్ ఆరు వికెట్లు తీశాడు. కేశ‌వ్ మ‌హ‌రాజ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మార్కో జాన్సెన్‌, సేనురన్ ముత్తుసామి లు చెరో వికెట్ ప‌డ‌గొట్టారు.

Smriti Mandhana : ఆస్ప‌త్రి నుంచి స్మృతి మంధాన తండ్రి డిశ్చార్జ్‌.. పెళ్లి ఎప్పుడంటే..?

మ్యాచ్ సంక్షిప్త స్కోర్లు..

* ద‌క్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ – 489 ఆలౌట్
* భార‌త తొలి ఇన్నింగ్స్ – 201 ఆలౌట్
* ద‌క్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ – 260 5 డిక్లేర్‌
* భార‌త్ రెండో ఇన్నింగ్స్ – 140 ఆలౌట్‌