ICC T20 Rankings : టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా యువ స్పిన్న‌ర్ బిష్ణోయ్ దూకుడు.. ఏకంగా అగ్ర‌స్థానం.. సూర్య సంగ‌తేంటంటే..?

ICC T20 Bowling Rankings : క్రికెట్ ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం టీమ్ఇండియా హ‌వా న‌డుస్తోంది. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు సత్తా చాటారు.

Surya kumar yadav-Ravi Bishnoi

ICC T20 Bowling Rankings : క్రికెట్ ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం టీమ్ఇండియా హ‌వా న‌డుస్తోంది. గ‌త కొంత‌కాలంగా అద్వితీయ విజ‌యాలు సాధిస్తోంది. వ్య‌క్తిగ‌తంగా కూడా ఆట‌గాళ్లు రాణిస్తున్నారు. ఈ క్ర‌మంలో అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు సత్తా చాటారు. ముఖ్యంగా టీమ్ఇండియా యువ స్పిన్న‌ర్ ర‌వి బిష్ణోయ్ మాత్రం అద‌ర‌గొట్టాడు. ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌లో స‌త్తా చాటిన బిష్ణోయ్ ఏకంగా తొమ్మిది వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ క్ర‌మంలో టీ20 బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానానికి చేరుకున్నాడు.

గ‌త‌వారం ప్ర‌క‌టించిన ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న బిష్ణోయ్ ఏకంగా నాలుగు స్థానాల‌ను మెరుగుప‌ర‌చుకున్నాడు. ఈ క్ర‌మంలో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్న‌ర్ ర‌షీద్‌ఖాన్‌ను వెన‌క్కి నెట్టాడు 23 ఏళ్ల బిష్ణోయ్‌. 699 రేటింగ్ పాయింట్లు అత‌డి ఖాతాలో ఉన్నాయి. ఆ త‌రువాతి స్థానాల్లో అఫ్గానిస్థాన్ ఆట‌గాడు ర‌షీద్ ఖాన్ (692), శ్రీలంక స్పిన్న‌ర్ వానిందు హ‌స‌రంగ (679), ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ ఆదిల్ ర‌షీద్ (679), శ్రీలంక ఆట‌గాడు మ‌హేశ్ తీక్ష‌ణ (677)లు వ‌రుస‌గా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.

obstructing the field : ‘అబ్‌స్ట్రాకింగ్‌ ది ఫీల్డ్’ అంటే ఏమిటి..? క్రికెట్‌లో ఇలా ఔటైన టీమ్ఇండియా ఆట‌గాడు ఎవ‌రంటే..?

సూర్య‌నే..

టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ విభాగంలో సూర్య‌కుమార్ త‌న అగ్ర‌స్థానాన్ని కాపాడుకున్నాడు. 855 రేటింగ్ పాయింట్లు సూర్య ఖాతాలో ఉన్నాయి. ఆ త‌రువాతి స్థానాల్లో పాకిస్తాన్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ రిజ్వాన్ (787), ద‌క్షిణాఫ్రికా ప్లేయ‌ర్ ఎయిడెన్ మార్క్ర‌మ్ (756), పాకిస్తాన్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజాం (734), ద‌క్షిణాప్రికా ప్లేయ‌ర్ రిలీ రూసొ (702) లు వ‌రుస‌గా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొన‌సాగుతున్నారు.

Obstructing The Field : విచిత్ర రీతిలో ఔటైన బంగ్లాదేశ్ సీనియ‌ర్ ఆట‌గాడు.. చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు..

surya kumar yadav

ఇక ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో సెంచ‌రీ చేయ‌డంతో పాటు సిరీస్‌లో మొత్తంగా 223 ప‌రుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్ 688 రేటింగ్ పాయింట్ల‌తో ఏడులో నిలిచాడు. టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ య‌శ‌స్విజైస్వాల్ 16 స్థానాలు మెరుగుప‌ర‌చుకుని 19వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ఆల్‌రౌండ‌ర్ల విభాగంలో టీమ్ఇండియా ఆట‌గాడు హార్దిక్ పాండ్య మూడో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో బంగ్లాదేశ్ స్టార్ ఆట‌గాడు ష‌కీబ్ అల్ హ‌స‌న్ మొద‌టి స్థానంలో నిల‌వ‌గా, అఫ్గానిస్తాన్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ న‌బీ రెండులో కొన‌సాగుతున్నారు.

ఇక జ‌ట్ల ర్యాకింగ్స్ విష‌యానికి వ‌స్తే.. టీమ్ఇండియా అన్ని ఫార్మాట్ల‌లో నంబ‌ర్ వ‌న్‌గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు