×
Ad

Suryakumar Yadav : నాలుగేళ్లలో ఇదే తొలిసారి.. సూర్య ఇదేంద‌య్యా..

టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) గ‌త కొంత కాలంగా పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు.

ICC T20I rankings first time in 4 years Suryakumar Yadav on verge of being knocked out of top 10

Suryakumar Yadav : టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్ గ‌త కొంత కాలంగా పేల‌వ ఫామ్‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నాడు. ఇది ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో తీవ్రంగా ప్ర‌తిబింబిస్తోంది. గ‌త నాలుగేళ్ల‌లో తొలిసారి అత‌డు టాప్‌-10లో త‌న స్థానాన్ని కోల్పోయే ప్ర‌మాదంలో ప‌డ్డాడు. తాజాగా ప్ర‌క‌టించిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 10వ స్థానానికి ప‌డిపోయాడు. అత‌డి ఖాతాలో 669 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

2023 సూర్య‌కుమార్ యాద‌వ్ (Suryakumar Yadav) అత్యుత్త‌మ రేటింగ్ పాయింట్లు సంపాదించుకున్నాడు. అప్పుడు అత‌డు 912 రేటింగ్ పాయింట్ల‌ను కలిగి ఉన్నాడు.

IPL 2026 Auction : 10 ఫ్రాంఛైజీలు రూ.215 కోట్లలో జస్ట్ ఈ ఐదుగురు ప్లేయర్స్ కే 40 శాతం పర్సు ఫసక్..

ఇక ఈ ఏడాది అత‌డు 18 ఇన్నింగ్స్‌ల్లో 125.29 స్ట్రైట్‌రేటు 14.2 స‌గ‌టుతో 213 ప‌రుగులు మాత్ర‌మే సాధించాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు రెండు నెల‌ల క‌న్నా త‌క్కువ స‌మ‌య‌మే ఉండ‌డంతో సూర్య‌కుమార్ యాద‌వ్ వీలైనంత త్వ‌ర‌గా ఫామ్‌లోకి రావాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు.

అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకున్న అభిషేక్‌..

టీమ్ఇండియా యువ ఆటగాడు అభిషేక్ శ‌ర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో త‌న అగ్ర‌స్థానాన్ని నిల‌బెట్టుకున్నాడు. అతడి ఖాతాలో 909 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. ద‌క్షిణాఫ్రికాతో రెండు, మూడు టీ20ల్లో రాణించిన హైద‌రాబాద్ కుర్రాడు తిల‌క్ వ‌ర్మ రెండు స్థానాలు ఎగ‌బాకి నాలుగో స్థానానికి చేరుకున్నాడు. తిల‌క్ ఖాతాలో 774 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.

Mangesh Yadav : ఆర్‌సీబీ కోట్లు కుమ్మ‌రించిన మంగేష్ యాదవ్ ఎవరు? అత‌డి ట్రాక్ రికార్డు ఏంటి?

ఐసీసీ టీ20 బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌..

* అభిషేక్ శ‌ర్మ (భార‌త్) – 909 రేటింగ్ పాయింట్లు
* ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్) – 849 రేటింగ్ పాయింట్లు
* పాతుమ్ నిస్సాంక (శ్రీలంక‌) – 779 రేటింగ్ పాయింట్లు
* తిల‌క్ వ‌ర్మ (భార‌త్‌) – 774 రేటింగ్ పాయింట్లు
* జోస్ బ‌ట్ల‌ర్ (ఇంగ్లాండ్‌) – 770 రేటింగ్ పాయింట్లు