ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి దూసుకొచ్చిన రోహిత్ శ‌ర్మ‌.. మెరుగైన విరాట్, బుమ్రా, సిరాజ్ ర్యాంకులు

ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఆటగాళ్ల టెస్ట్ ర్యాంకింగ్స్ ను అప్ డేట్ చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో భారత్ సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ విభాగంలో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు.

rohit and virat

Test Rankings : ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) ఆటగాళ్ల టెస్ట్ ర్యాంకింగ్స్ ను అప్ డేట్ చేసింది. ఈ ర్యాంకింగ్స్ లో భారత్ సూపర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ విభాగంలో తమ స్థానాలను మెరుగుపర్చుకున్నారు. బౌలింగ్ విభాగంగా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ల ర్యాంకులు మెరుగయ్యాయి. టీమిండియా, ఆస్ట్రేలియా రెండూ కేప్ టౌన్, సిడ్నీల్లో తమతమ టెస్ట్ మ్యాచ్ లను గెలుచుకోవటంతో.. ఎక్కువగా ఆ రెండు జట్ల ఆటగాళ్ల ర్యాంకులు మెరుగయ్యాయి. పాకిస్థాన్ స్టార్ బ్యాటర్ బాబర్ అజం బ్యాటింగ్ విభాగంలో మెరుగైన స్థానాన్ని కోల్పోయాడు.

Also Read : Aakash Chopra : వైస్ కెప్టెన్‌కి చోటు లేదా..? ఇషాన్ కిష‌న్ ప‌రిస్థితేంటి..?

టెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ మూడు స్థానాలు ఎగబాకి 6వ స్థానంకు చేరుకున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు విరాట్ కోహ్లీ. అతను నాలుగు ఇన్నింగ్స్ లలో 172 పరుగులు చేశాడు. దీంతో తాజాగా వెల్లడైన ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో కోహ్లీ గతంలో ఉన్న 9వ ర్యాంకు నుంచి 775 పాయింట్లతో 6వ ర్యాంక్ కు చేరుకున్నాడు. భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ నాలుగు స్థానాలు ఎగబాకి టాప్-10లోకి దూసుకొచ్చాడు. గతంలో 14వ ర్యాంక్‌లో ఉన్న రోహిత్ శర్మ తాజా ర్యాంకింగ్స్ లో 748 పాయింట్లతో 10వ స్థానానికి ఎగబాకాడు. ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్ విభాగంలో తొలిస్థానంలో కేన్ విలియమ్సన్ (864 పాయింట్లు) నిలిచాడు. జో రూట్ (859), స్టీవ్ స్మిత్ (818 పాయింట్లు), మార్నస్ లాబుషాగ్నే (802 పాయింట్లు), డారిల్ మిచెల్ (786 పాయింట్స్) టాప్ ఫైవ్ బ్యాటర్లుగా నిలిచారు.

Also Read : Rohit Sharma : టీ20ల్లో ప‌లు రికార్డుల‌పై రోహిత్ శ‌ర్మ క‌న్ను.. మూడు మ్యాచుల్లో సాధిస్తాడా..?

బౌలింగ్ విభాగంలో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ గతంలోలా అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టు లో తొలి ఇన్నింగ్స్ లో 6/15తో కెరీర్ లో అత్యుత్తమ స్కోరు నమోదు చేసిన భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ 13 స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకు కు చేరుకున్నాడు. భారత్ ప్రధాన బౌలర్ జస్ర్పీత్ బుమ్రా దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ లో 12 వికెట్లు పడగొట్టడం ద్వారా ఒక స్థానం ఎగబాకి ప్రస్తుత ర్యాంకింగ్స్ లో 4వ స్థానంకు చేరుకున్నాడు. మరోవైపు వరుసగా మూడుసార్లు ఐదు వికెట్లు ఫీట్ సాధించిన ఆస్ట్రేలియన్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సౌతాఫ్రికా ప్లేయర్ రబాడను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. జాష్ హెజిల్ వుడ్ నాలుగు స్థానాలను మెరుగుపర్చుకొని జేమ్స్ ఆండర్సన్ తో కలిసి ఏడో స్థానంలో నిలిచాడు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు